2024 ఎన్నికల్లో ఏపీలో అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న టీడీపీ.. ఒక చక్కటి ప్రతిపాదనను తెరమీ దికి తెచ్చింది. గత నెలలో జరిగిన మహానాడులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక ప్రకట న చేశారు. వరుసగా మూడు సార్లు ఓడిపోయిన నేతకు టికెట్ ఇచ్చేది లేదు.. అని చెప్పారు.
ఇది పార్టీలో జోష్ నింపిన ప్రకటన. ఇంత వరకుబాగానే ఉంది. అయితే.. ఈ ప్రతిపాదనను కార్యాచరణలోకి తీసుకువస్తే.. తొలుత పార్టీకి ఎదురయ్యే పెద్ద సమస్య.. తుని నియోజకవర్గమే అంటున్నారు పరిశీలకులు.
ఎందుకంటే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తునిలో ఒకప్పుడు టీడీపీ కంచుకోట అనే పేరు ఉంది. ఇక్క డ నుంచి పార్టీ సీనియర్ నేత, ననెంబర్ 2 అనదగిన నాయకుడు.. మాజీ ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు గెలుపు గుర్రం ఎక్కారు. 1983లో అన్నగారు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్న యనమలను అన్నగారే స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సమయం లోనే ఆయనకు తుని నియోజకవర్గం టికెట్ ఇచ్చారు.
ఇలా 1983లో తొలిసారి తుని నుంచి పోటీ చేసిన యనమల.. వెనుదిరిగి చూసుకోకుండా.. 2004 వరకు వరుస విజయాలు దక్కించుకున్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన దిగ్గజ నాయకులను కూడా మట్టి కరిపించారనే పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. 2004లో టీడీపీ వ్యతిరక పపవనాలు.. వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకూల పవనాలు వీచినప్పుడుకూడా.. యనమల విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆ తర్వాత.. ఆయన 2009 ఎన్నికల్లో ఓడిపోయారు.
తర్వాత.. 2014, 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు.. యనమల కృష్ణుడు.. ఉరఫ్ పళ్ల కృష్ణుడు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అంటే..వ రుసగా మూడుసార్లు యనమల కుటుంబం ఇక్కడ ఓడిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో లోకేష్ చేసిన శపథం అమలు చేయాలంటే...(అంటే.. వచ్చే ఎన్నికల్లో మూడు సార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఇచ్చేది లేదని) తొలుత తుని నియోజకవర్గంపై ఎలాంటి నిర్ణయం తీ సుకుంటారో.. చెప్పాలని.. టీడీపీలోనే అంతర్గత చర్చ తెరమీదికి వచ్చింది.
ఇది ఒక రకంగా.. పార్టీకి ఇబ్బందికర పరిణామమే. ఎందుకంటే.. తునిలో యనమలను కాదని.. ఎవరికీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. పోనీ.. అలాగని.. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో యనమల కుటుంబానికి టికెట్ ఇచ్చి.. వేరే చోట్ల వరుసగా ఓడిన నాయకులను పక్కన పెడితే.. అది మరింత రివర్స్ వ్యవహారంగా మారిపోతుంది. అందుకే.. కొందరు నాయకులు.. ముందు తునిపై నిర్ణయం ప్రకటించి.. తమ వద్దకు రావాలని.. ఇప్పటికే సంకేతాలు పంపుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.