హరీష్.. ఎందుకిలా దూరంగా..?

Update: 2019-06-02 16:24 GMT
హరీష్ రావు.. తెలంగాణ ఉద్యమం వేళ ఫైర్ బ్రాండ్. కేసీఆర్ తర్వాత టీఆర్ ఎస్ లో నంబర్ 2. ట్రబుల్ షూటర్.. పార్టీని గెలిపించడంలో.. ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు. మొదటి ఐదేళ్లలో హరీష్ రావు చేసిన కృషి అంతా ఇంతాకాదు.. కానీ ఇప్పుడు హరీష్ రావు పేరే లేదు.. కేవలం ఒక టీఆర్ ఎస్ ఎమ్మెల్యే.. ఎటువంటి ప్రాధాన్యమూ ప్రభుత్వంలో లేదు.

తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చేసిన నిర్ణయాలు ఆయన ఫ్యామిలీకి వ్యక్తిగతంగా లాభం చేకూర్చినా.. పార్టీని మాత్రం ప్రజల్లో ఫేత్ లేకుండా చేశాయి. ముఖ్యంగా కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేయడం.. హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. అదే ఇంపాక్ట్ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిధ్వనించింది. కేసీఆర్ తీరుకు ఆరు నెలల్లోనే 7 ఎంపీ సీట్లను తగ్గించి సారు - కారు.. సర్కారుకు అభిలాషకు షాక్ ఇచ్చారు తెలంగాణ ప్రజలు..

ఇలా తన ప్రమేయం ప్రాధాన్యత తగ్గడంపై హరీష్ రావు కూడా యాక్టివ్ రోల్ తగ్గించాడు. హైదరాబాద్ లో కనిపించడమే తగ్గించేశాడు. ప్రగతి భవన్ లో చాలా రోజుల తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీని గెలిపించాక ఎంపీతో కలిసి కేసీఆర్ ను కలిశారు. ఇక ఈరోజు తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కూడా హరీష్ రావు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.

ఇక రేపు హరీష్ రావు బర్త్ డే. అయితే తన బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ లో కానీ.. సిద్దిపేటలో కానీ తాను ఉండడం లేదని.. వ్యక్తిగత పనుల మీద దూరంగా వెళ్తున్నానని హరీష్ రావు ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం అని చెబుతున్నా.. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కకపోవడం వల్లే హరీష్ రావు ఇలా చేస్తున్నాడన్న వాదన వినిపిస్తోంది. మరి హరీష్ రావు ఇలా దూరంగా జరగడం వెనుక ఏమై ఉంటుందా అన్న చర్చ ప్రస్తుతం గులాబీ పార్టీలో తీవ్రంగా సాగుతోంది.


Tags:    

Similar News