అప్పుడెప్పుడో 1980లలో భవిష్యత్ లో ఇంటి పోరు ఉండకూడదని, వారసులు రాజకీయ వారసత్వం కోసం తన్నుకోకూడదని తమిళనాడు రాజకీయ కురువృద్దుడు - డీఎంకె అధినేత కరుణానిధి తన పెద్ద కుమారుడు అళగిరిని చెన్నై నుండి మధురైకి సాగదోలాడు. అక్కడే ఉండి రాజకీయాలు చూసుకోవాలని, పార్టీ పత్రిక మురసోలిని నడపాలని చెప్పి పంపించాడు.
తండ్రి ఆదేశాల ప్రకారం అళగిరి మధురై వెళ్లి రాజకీయంగా నిలదొక్కుకున్నాడు. మధురై పరిసరాలు తన కనుసన్నలలో మెదిలేలా పట్టు పెంచుకోవడమే కాకుండా .. చుట్టు పక్కల జిల్లాలలో కూడా తన ప్రభావం పెంచుకున్నాడు. కాలక్రమేణా చిన్న కొడుకు స్టాలిన్ ఎదిగివచ్చాడు. అళగిరి తండ్రి స్థానాన్ని ఆశించినా కరుణానిధి మాత్రం చిన్న కుమారుడు స్టాలిన్ నే రాజకీయ వారసుడిగా ప్రకటించాడు. ఎదిరించిన అళగిరిని పార్టీ నుండి బహిష్కరించాడు.
తండ్రి చేతిలో అవమానంతో తల్లడిల్లిన అళగిరి తాజా ఎన్నికల్లో తండ్రిని - తమ్ముడిని కోలుకోలేని దెబ్బకొట్టాడు. డిఎంకెకు ఓటేయనని ప్రకటించిన అళగిరి తన అనుచరులను కూడా అన్నాడీఎంకెకు ఓటేయాలని చెప్పాడట. అళగిరికి పట్టున్న మధురైలో 10 స్థానాలకు ఎనిమిది అన్నాడీఎంకె గెలవడం దీనికి బలం చేకూరుస్తుంది. అంతే కాదు మధురై - తిరునెల్వేలి - తేని - దిండిగల్ - విరుద్ నగర్ జిల్లాల్లో మొత్తం 56 స్థానాల్లో అన్నాడీఎంకే విజయం సాధించింది. తండ్రి ఓటమితో అళగిరి సంబరాల్లో మునిగి తేలుతున్నాడట.