కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్లు పనిచేస్తాయా? నిపుణులు ఏమంటున్నారు?

Update: 2021-03-02 06:30 GMT
ప్రస్తుతం మనదేశంలో వ్యాక్సినేషన్​ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటిదశ వ్యాక్సిన్​ పూర్తయ్యింది. ఫ్రంట్​లైన్​ వారియటర్స్​ (వైద్యులు, వైద్యసిబ్బంది)కి వ్యాక్సినేషన్​ ఇచ్చారు. ప్రస్తుతం వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు వ్యాక్సిన్లు ఇస్తున్నారు. భారత్​ బయోటెక్​ తయారుచేసిన కోవాగ్జిన్​.. సీరం ఇన్​స్టిట్యూట్​ తయారుచేసిన కోవిషీల్డ్​ వ్యాక్సిన్​ను ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కొత్త స్ట్రెయిన్​ కరోనా వేగంగా వ్యాపిస్తున్నది.. ఈ నేపథ్యంలో అసలు వ్యాక్సిన్లు కొత్త స్ట్రెయిన్​ కరోనా వైరస్​పై పనిచేస్తాయా? లేదా? నిపుణులు ఏమంటున్నారు? తదితర విషయాలు తెలుసుకుందాం..

 ఇప్పటికే పలు దేశాల్లో కరోనా స్ట్రెయిన్​ కరోనా కేసులు బయట పడుతున్న విషయం తెలిసిందే. బ్రెజిల్‌లో మొట్టమొదటిసారిగా ఈ కొత్త స్ట్రెయిన్​ గుర్తించారు. అయితే బ్రిటన్​ లో ఈ కేసు లో ఎక్కువగా బయట పడుతున్నాయి. అయితే కొందరు నిపుణులు మాత్రం కొత్త స్ట్రెయిన్​పై వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేయకపోవచ్చని అంటున్నారు.  నిజానికి కొత్త వేరియంట్​ కరోనా కేసులు వేల సంఖ్యలో ఉన్నాయి. అయితే వాటిలో యూకే లేదా కెంట్ వేరియంట్ (B.1.1.7) వేగంగా వ్యాపిస్తున్నది. ఈ వేరియంట్​ బ్రిటన్​ నుంచి 50 దేశాలకు విస్తరించింది.

మరో వేరియంట్.. సౌతాఫ్రికా వేరియంట్.. (B.1.351) యూకే సహా కనీసం 20 ఇతర దేశాల్లోనూ ఈ వేరియంట్ వ్యాపిస్తోంది. బ్రెజిల్ వేరియంట్ (P1) జపాన్ వెళ్లిన నలుగురిలో ఈ వైరస్ కనిపించింది.  అయితే కొత్త వేరియంట్​లు ప్రాణాంతం ఏమీ కాదని కొందరు నిపుణులు అంటున్నారు. ఇందుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు ఏవి లభించ లేదని వాళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం యూకే, బ్రెజిల్​, దక్షణాఫ్రికా వేరియంట్లు వేగంగా విస్తరిస్తున్నాయి.  యూకే, సౌతాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లు అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వైరస్ ను వ్యాపించగలవు.

 ఈ మూడు కొత్త వేరియంట్లు తమ స్పైక్ ప్రోటీన్ ను మార్చేసుకున్నాయి. హ్యుమన్ సెల్స్ కు అటాచ్ చేసే ఈ స్పైక్ ప్రోటీన్ ఎప్పటికప్పుడూ కొత్త రూపును మార్చుకుంటున్నాయి. అయితే ఈ కొత్త వేరియంట్లు వేగంగా వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్ల మీద కూడా ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఇవి ప్రభావంతం గా పని చేస్తాయని మాత్రం చెప్పలేమని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది.
Tags:    

Similar News