ఆ చిన్నారికి జ‌రిగింది చూసి వైద్యులే వ‌ణికారు

Update: 2018-06-30 07:06 GMT
కొన్ని తెలీకుంటే మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటుంది. కొన్ని ఉదంతాల గురించి తెలీకుండా ఉంటే మంచిద‌నిపిస్తుంది. కానీ.. మ‌న‌చుట్టూ ఉన్న వారిలో ఎంత‌టి దుర్మార్గులు ఉన్నార‌న్న విష‌యంపై అవ‌గాహ‌న‌.. అలాంటి వారి పాలిట ప‌డ‌కుండా మ‌న వాళ్ల‌ను ఎంత జాగ్ర‌త్త‌గా ఉంచుకోవాల‌న్న ఆలోచ‌న క‌లిగించ‌టం కోసం మాత్ర‌మే ఇది రాస్తున్నాం త‌ప్పించి.. మామూలుగా అయితే.. ఈ వార్త రాయాల‌నిపించ‌లేదు.

దుర్మార్గం.. దారుణం.. పైశాచికం అన్న మాట‌లు సైతం ఆ క‌సాయి చేసిన ప‌ని ముందు చిన్న‌బోతాయేమో? ఎనిమిదేళ్ల చిన్నారికి జ‌రిగిన అన్యాయాన్ని చూసి.. ఆమెకు వైద్యం చేయాల్సిన వైద్యుల చేతులు సైతం వ‌ణికిపోయాయి. త‌మ జీవితంలో ఇంత దారుణాన్ని తాము చూడ‌లేద‌ని వాపోయారంటే.. నేర తీవ్ర‌త ఎంత‌న్న‌ది ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి.. యావ‌త్ దేశాన్ని క‌దిలించిన ఢిల్లీ నిర్భ‌య ఉదంతాన్ని గుర్తుకు తెచ్చేలా చోటు చేసుకున్న ఈ ఉదంతం వివ‌రాల్లోకి వెళితే..

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని మంద‌సౌర ప్రాంతంలో గ‌త మంగ‌ళ‌వారం చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఇప్పుడా ప్రాంతాన్ని వ‌ణికిస్తోంది. బాలిక ప‌ట్ల జ‌రిపిన పైశాచిక చ‌ర్య‌పై అక్క‌డి వారంతా ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. ఈ న‌ర‌రూప రాక్ష‌సుడ్ని చిత్ర‌వ‌ధ‌లు పెట్టి చంపేయాల‌ని కోరుతున్నారు. ఎనిమిదేళ్ల చిన్నారి స్కూల్ నుంచి వ‌స్తున్న వేళ‌.. బ‌ల‌వంతంగా తీసుకెళ్లిన ఒక‌డు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అదెంత దారుణంగా అంటే.. ఆమెకు ఎదురైన హింస‌ను చూసిన వైద్యులు సైతం వ‌ణికిపోయే ప‌రిస్థితి.

చిన్నారి ప్రైవేట్ పార్ట్ లోకి క‌ర్ర‌ను కానీ రాడ్‌ ను కానీ బ‌లంగా తిప్ప‌టంతో ర‌క్తం గ‌డ్డ క‌ట్టుకుపోవ‌ట‌మే కాదు.. పేగులు బ‌య‌ట‌కు వ‌చ్చిన దారుణ ప‌రిస్థితి. న‌ర‌కాన్ని చూసిన ఆ చిన్నారి అచేత‌నంగా ఉన్న ప‌రిస్థితుల్లో వైద్యం చేసిన డాక్ట‌ర్లు.. ఆ పాప ప‌రిస్థితి చూసి షాక్ తిన్నారు. ఆమెకు శ‌స్త్ర చికిత్స చేసే వేళ‌లో వారి చేతులు సైతం వ‌ణికిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. బ‌ల‌మైన ఆయుధాన్ని ఆమె గొంతులో దించి.. శ‌బ్దం రాకుండా చేసి అత్యంత క్రూరంగా అత్యాచారం జ‌రిపారు. దాదాపు మూడు గంట‌ల పాటు క‌ష్ట‌ప‌డి..రెండు శ‌స్త్ర‌చికిత్స‌లు చేసి ఆ పాప ప్రాణాల్నికాపాడారు. ఇప్ప‌టికి ఆ చిన్నారి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

కొత్త‌వాళ్ల‌ను చూసిన వెంట‌నే వ‌ణికిపోతున్న చిన్నారి మానసిక ప‌రిస్థితి చూస్తే.. కంట క‌న్నీరు ఆగ‌దు. ఆసుప‌త్రికి తీసుకొచ్చి వారం అయినా ఇప్ప‌టికి ఒక్క మాట కూడా మాట్లాడ‌లేక‌పోతోంద‌ని చెబుతున్నారు. ఈ దారుణాన్ని 20 ఏళ్ల దిన‌స‌రి కూలీ ఇర్పాన్ ఖాన్ చేసిన‌ట్లుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అత‌డ్ని ఉరి తీయాలంటూ చిన్నారి త‌ల్లిదండ్రులు.. బంధువులు డిమాండ్ చేస్తున్నారు. గ‌డిచిన రెండు రోజులుగా మంద‌సౌర్‌.. నీమూచ్ ల‌లో ప్ర‌జ‌లు స్వ‌చ్చందంగా బంద్ పాటించారు. ఇర్ఫాన్ చ‌స్తే.. అత‌ని మృత‌దేహాన్ని త‌మ శ్మ‌శానంలో పూడ్చ‌నీయ‌మ‌ని ముస్లిం మ‌త పెద్ద‌లు ప్ర‌క‌టించారు. ఇర్ఫాన్ ను స్థానికుల ఆగ్ర‌హం నుంచి త‌ప్పించ‌టం ఇప్పుడు పోలీసుల‌కు పెద్ద స‌వాలుగా మారింద‌ని చెబుతున్నారు. ఇలాంటి క్రూరుడికి కోర్టు ఎంత‌కాలానికి శిక్ష విధిస్తుందో..?
Tags:    

Similar News