లాక్ డౌన్... ప్రపంచ దేశాలను వణికించేస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనాను కట్టడి చేసేందుకు భారత్ తో పాటు దాదాపుగా అన్ని దేశాలు కూడా అమలు చేస్తున్న కఠిన నిబంధనల అస్త్రం. కరోనా చుట్టుముడితే.. దాని నుంచి తమ ప్రజలను కాపాడుకునేందుకు దాదాపుగా అన్ని దేశాలు లాక్ డౌన్ నే వినియోగిస్తున్న వైనం చూస్తున్నదే. మొత్తంగా చెప్పాలంటే... ఇప్పటిదాకా మందు లేని కరోనాను కట్టడి చేసేందుకు మన ముందున్న అస్త్రం లాక్ డౌన్ ఒక్కటే. అయితే... ఇదే లాక్ డౌన్ అటు కరోనాను కట్టడి చేస్తున్నా... ఇటు మహిళలపై మాత్రం గృహ హింస అమాంతంగా పెరిగిపోయేందుకు కారణమైందట. ఇదేదో కాకి లెక్కలు చెప్పినట్టుగా కాదు.. సాక్షాత్తు మహిళలకు అండాదండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ మహిళా కమిషన్ చెప్పిన మాట ఇది.
జాతీయ మహిళా కమిషన్ కూడా అదేదో తన నోటికి వచ్చినట్టుగా ఈ మాట చెప్పలేదు. లాక్ డౌన్ ను ముందు - లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత తమకు అందిన ఫిర్యాదు సంఖ్యను ఆధారంగా చేసుకుని మరీ నిగ్గుతేల్చిన విషయం ఇది. అసలు లాక్ డౌన్ లో ఇళ్లకే పరిమితమైన పురుషులు... ఇళ్లలో తమ భార్యలపై ఏ విధంగా రెచ్చిపోతున్నారో తెలియజేస్తున్న గణాంకాలను కమిషన్ బయటపెట్టేసింది. 27 ఫిబ్రవరి నుంచి 22 మార్చి మధ్య వచ్చిన ఫిర్యాదుల సంఖ్యతో... 23 మార్చి నుంచి 16 ఏప్రిల్ మధ్యలో వచ్చిన ఫిర్యాదుల సంఖ్యను పోల్చిన తర్వాతే కమిషన్ ఈ మాట చెప్పేసింది.
లాక్ డౌన్ కు ముందు అంటే 27 ఫిబ్రవరి నుంచి మార్చి 22 మధ్యలో మహిళా కమిషన్ కు 396 ఫిర్యాదులు అందాయట. అదే సమయంలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత మార్చి 23 నుంచి ఏప్రిల్ 16 మధ్యలో ఈ సంఖ్య ఏకంగా 587కు పెరిగిపోయిందట. అంటే లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత గృహ హింసకు సంబంధించి మహిళా కమిషన్ కు వచ్చిన ఫిర్యాదుల్లో 40 శాతం మేర పెరుగుదల కనిపించిందన్న మాట. ఈ లెక్కన లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటిపట్టునే ఉంటున్న భార్యాభర్తల మధ్య తగాదాలు బాగా పెరిగాయని, భార్యలపై భర్తలు తమదైన శైలి ప్రతాపం చూపారనే చెప్పాలి. గృహ హింస ఫిర్యాదులతో పాటు లాక్ డౌన్ కాలంలో విడాకుల సంఖ్య కూడా ఓ రేంజిలో పెరిగిపోయిందన్న మాటలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.