అత్త‌మామ‌ల కోసం ట్రంప్ అడ్డంగా బుక్క‌య్యాడు

Update: 2018-08-12 05:01 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్డంగా బుక్క‌య్యారు. త‌ను ఏ విధానాన్ని అయితే విమ‌ర్శిస్తున్నారో అదే విధానాన్ని త‌న వారికోసం అవ‌లంభించారు. త‌ద్వారా అడ్డంగా బుక్క‌య్యారు. చైన్ మైగ్రేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న ట్రంప్ తన అత్తమామలకు మాత్రం.. అదే కుటుంబ వీసా కార్యక్రమం కింద దేశ పౌరసత్వం కల్పించారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తల్లిదండ్రులు విక్టర్ - అమాలిజా క్నావ్స్ కుటుంబ వీసా కార్యక్రమం ద్వారా అమెరికా పౌరసత్వం పొందారు. ఈ మేరకు వారు గురువారం న్యూయార్క్ సిటీలోని ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ కోర్టులో గురువారం అమెరికా పౌరులుగా ప్రమాణం చేశారు. ఈ ప‌రిణామం విప‌క్షాల‌కు అస్త్రంగా మారింది.

చైన్ ఇమ్మిగ్రేషన్‌ ను వ్యతిరేకిస్తున్న ట్రంప్..దానికి చరమగీతం పలుకాలని గత నవంబర్‌ లో ట్విట్టర్ వేదికగా స్పందించారు. ``కొందరు ఇక్కడకు వస్తారు. తర్వాత మొత్తం వారి కుటుంబాన్ని తీసుకొస్తారు. ఇది నిజంగా దుర్మార్గం`` అని ట్వీట్ చేశారు. పలు సభల్లోనూ కుటుంబ ఆధారిత చైన్ ఇమ్మిగ్రేషన్‌ కు వ్యతిరేకంగా ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచంలోకెల్లా చెత్తకుప్పల్లో వేయదగిన ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో అమెరికా చట్టం ఉంటుందని విమర్శించారు. అయితే త‌న అత్త‌మామ‌ల విష‌యంలో అదే ప‌ద్ద‌తిని పాటించారు. మెలానియా తల్లిదండ్రులు విక్టర్ - అమాలిజా క్నావ్స్‌లు స్లోవేకియాకు చెందిన వారు. ఇప్పటివరకు వారు మెలానియా ట్రంప్ ఇచ్చిన గ్రీన్‌ కార్డుపైనే ఆధారపడి అమెరికాలో ఉన్నారు. కుటుంబ వీసా విధానం కింద ప్రస్తుతం ఆ దేశ పౌరసత్వం కూడా వారికి లభించింది.
Tags:    

Similar News