అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఐదుదేశాల టూర్ లో ఉన్న ట్రంప్ వియత్నాంలో ఇవాళ జరిగిన ఎపెక్ సీఈవో సదస్సులో మాట్లాడారు. ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధి కోసం భారత్‌తో పాటు ఆ దేశ ప్రధాని మోడీ కూడా విశేషంగా కృషి చేస్తున్నారని ట్రంప్ కితాబిచ్చారు. ఈ విషయంలో ప్రధాని మోడీని ప్రశంసించకుండా ఉండలేమని ట్రంప్ అన్నారు. ఎపెక్ కూటమిలో లేని దేశాలు కూడా ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నాయని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు.
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తి అవుతోందని - వంద కోట్ల మందితో అత్యంత పెద్ద ప్రజాస్వామ్యంగా దేశంగా నిలిచిందని ట్రంప్ ప్రశంసించారు. ``ఇప్పుడు భారతదేశం ఆర్థికంగానూ ఎదిగింది - ఆర్థిక ప్రగతి బాగుతుంది - దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రధాని మోడీ బాగా పనిచేస్తున్నారు. చాలా విజయవంతంగా మోడీ తన పరిపాలనలో దూసుకెళ్లుతున్నారు. అవకాశాల స్వర్గంగా భారతదేశం నిలుస్తోంది. పెట్టుబడులకు - స్వేచ్చా వాణిజ్యానికి భారత్ ప్రతీకగా నిలుస్తోంది` అని ట్రంప్ తన సందేశంలో తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఏ దేశంతోనైనా వాణిజ్య సంబంధాలు పెట్టుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు.
కాగా, అంతకుముందు రోజు జరిగిన సమావేశంలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరకొరియాతోపాటు, పలు ప్రపంచ సమస్యలను కలిసి పరిష్కరించుకుందామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడి సూచించారు. అమెరికా అధ్యక్షుడి చైనా పర్యటన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య 250 బిలియన్ డాలర్ల (రూ.162లక్షల కోట్ల) వాణిజ్య ఒప్పందాలు ఖరారయ్యాయి. ఈమేరకు ఇరుదేశాల అధ్యక్షులు ట్రంప్ - జిన్ పింగ్ సమక్షంలో సంతకాలు పూర్తయ్యాయి. చైనాతో బలమైన వాణిజ్యసంబంధాలను అమెరికా కోరుకుంటున్నదని ట్రంప్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో భారీగా వ్యాపారలోటు ఉండటం సిగ్గుచేటని - అమెరికాలో తన మార్కెట్ ను పెంచుకునేందుకు చైనా ప్రయత్నించాలని ఆయన అన్నారు