ఇటీవల భారతీయులకు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ సహా ఇతర రంగాల నిపుణులకు అవకాశాల గడ్డగా పేరొందిన అమెరికా నుంచి చేదువార్త వినేందుకు కారణమైన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారీ తీపికబురు వినిపించారు. మన దేశానికి విశేష గౌరవం కట్టబెట్టారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా నూతన జాతీయ భద్రతా విధానాన్ని ప్రకటించింది. ఇందులో గ్లోబల్ శక్తిగా భారత్ ఆవిర్భవిస్తున్న తీరును అమెరికా మెచ్చుకుంది. భారత్ కు సహకారాన్ని అందించేందుకు పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. భద్రతా వ్యూహాం కింద ట్రంప్ ప్రభుత్వం భారత్ కు పూర్తి అండగా నిలవనుంది. చైనా - రష్యా - ఇస్లాం దేశాలను తమ శత్రువులుగా అమెరికా భావించనుంది.
అంతర్జాతీయంగా భారత్ ఎదుగుతున్న తీరును అమెరికా కీర్తించింది. భారత్‌తో బలమైన వ్యూహాత్మక, రక్షణ భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకోన్నట్లు అమెరికా వెల్లడించింది. అమెరికా ప్రభుత్వం రూపొందించిన వ్యూహాత్మక డాక్యుమెంట్ ఈ అంశాన్ని స్పష్టం చేసింది. బ్యాలెన్సింగ్ పవర్ గా ఉన్న భారత్.. ఇప్పుడు లీడింగ్ పవర్ గా మారుతోందని... ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలను తమ దేశం గుర్తిస్తున్నదని అమెరికా తెలిపింది. జపాన్ - ఆస్ట్రేలియాతో పాటు భారత్ కు సహకారం అందించనున్నట్లు అమెరికా పేర్కొంది. రక్షణ భాగస్వామ్యంలో భారత్ కీలకమైన దేశమని అమెరికా వెల్లడించింది.
మరోవైపు మన పొరుగున ఉన్న చైనాపై అమెరికా తన అసంతృప్తిని, ఆక్రోశాన్ని స్పష్టంగా వెళ్లగక్కింది. ట్రంప్ తన జాబితాలో ఇండియాను స్నేహపూర్వక దేశంగా పేర్కొన్నారు. కానీ దక్షిణ ఆసియాలో చైనా మాత్రం తన శత్రు దేశమని వెల్లడించారు. దక్షిణాసియా ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు అమెరికా తనదైన ప్రయత్నాలను మొదలుపెట్టనుందనే వార్తల నేపథ్యంలో ఈ ప్రకటన ఆసక్తికరంగా మారింది.