ట్రంప్ ఫస్ట్ ఎన్నికల ప్రచారం.. చైనానే టార్గెట్

Update: 2020-06-22 02:30 GMT
తన తొలి అధ్యక్ష ఎన్నికల ప్రచార సభలోనే చైనాపై విరుచుకుపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పదునైన విమర్శలు, ఘాటు ఆరోపణలు, సెటైర్లతో చైనాపై చెలరేగిపోయారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన మొట్టమొదటి ప్రచార ర్యాలీ ఓక్లహామా లో జరిగింది. ఇందులో ట్రంప్ చైనా తీరును తీవ్రంగా ఎండగట్టారు. కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయినా చైనా కుంగ్ ఫూకు ప్రత్యేకమైనదే కాదని.. కుంగ్ ఫ్లూ కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని ఆరోపించాడు. పైగా పొరుగు దేశం భారత్ పై కయ్యానికి కాలు దువ్వుతోందని ధ్వజమెత్తాడు.

ట్రంప్ తొలి ఎన్నికల ప్రచార సభలోనే చైనాను టార్గెట్ చేయడం అందరినీ దృష్టిని ఆకర్షించింది. ప్రత్యర్థులు, అమెరికా సమస్యలను పక్కనపెట్టి చైనా టార్గెట్ గా ట్రంప్ రాజకీయ ప్రచారం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాణాంతక కరోనాతో అమెరికన్ల చావుకు కారణమైన చైనానే ట్రంప్ టార్గెట్ చేశారు. కరోనాను ఇక నుంచి కుంగ్ ఫ్లూ అనాలని పిలుపునిచ్చారు. మార్షల్ ఆర్ట్స్ కుంగ్ ఫూ పుట్టినిల్లుతోపాటు కుంగ్ ఫ్లూను చైనానే పుట్టించిందని ఆరోపించాడు. కరోనాను 19 రకాల పేర్లతో పిలువవచ్చాన్నారు.

ఇక ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా చైనా తమ పొరుగు దేశం భారత్ తో సరిహద్దు వివాదాలను సృష్టించుకుందని అన్నారు. భారత్ తో ఘర్షణలకు దిగుతోందని విమర్శించాడు.

కరోనాతో అమెరికాలో 1.19 లక్షలమంది మరణించారని.. దీనికి కారణం చైనానే అని ట్రంప్ సెంటిమెంట్ రగిల్చాడు. తమ తమ దేశంలో ఈ వైరస్ వల్ల ఎంతో మంది ఆస్పత్రుల పాలయ్యారని.. అనేక దేశాలు దీని బారిన పడ్డాయని చైనాపై ట్రంప్ తీవ్ర విమర్శలతో తొలి ప్రచార సభలో హోరెత్తించారు.
Tags:    

Similar News