పవన్ అస్థానంలో ‘ఈనాడు’..?

Update: 2017-01-23 07:52 GMT
ఏపీ సర్కారుపై ఒత్తిడి తీసుకురావటం.. కేంద్రంలోని మోడీ సర్కారుకు షాకులు ఇచ్చే విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రచిస్తున్న వ్యూహాలు ఎంతలా ఉన్నాయన్న విషయం.. తాజాగా ఆయన పోస్టు చేస్తున్న ట్వీట్లను చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఒకటి తర్వాత మరొకటి అన్న రీతిలో వివిధ అంశాల మీద గళం విప్పుతున్న పవన్ కల్యాణ్ ఈ మధ్యన ట్వీట్ల జోరును భారీగా పెంచారు.

మరి.. ఆయన చేస్తున్న ట్వీట్లు మొత్తం ఆయనకు ఆయనే సొంతంగా చేస్తున్నవిగా చెప్పలేం. ఎందుకంటే.. పవన్ చేసే ట్వీట్ల లోతును చూస్తే.. విపరీతమైన అధ్యయనం.. వ్యూహాత్మకంగా ఉండటంతో పాటు.. ఒక క్రమపద్ధతిలో ఒత్తిడిని పెంచేలా ఉండటం గమనార్హం.

సమాచారాన్ని అందించటం.. అవసరానికి తగినంత ఆవేశాన్ని ప్రదర్శించటం.. భావోద్వేగాల్ని స్పృశించేలా వ్యవహరించటంతో పాటు.. ఉత్తరాది నాయకత్వం దక్షిణాది మీద ఎక్కి తొక్కుతోంది.. చిన్నచూపు చూస్తోందన్న మాటను తెలుగోళ్ల మనసుల్లో ఇంజెక్ట్ చేసే ప్రయత్నాన్ని పవన్ ముమ్మరం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరింత కాలిక్యులేటెడ్ గా చేయాలంటే ఒక్కరితోనో.. ఒకరిద్దరి ఆలోచనలతోనే సరిపోదు. అందుకే.. ఇలాంటి ట్వీట్లకు అవసరమైన ముడిసరుకును సిద్ధం చేసేందుకు ఒక టీంను ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ ట్వీట్లకు అవసరమైన ముడిసరుకును ఈనాడుకు చెందిన మాజీ ఉద్యోగులు కొందరు అందిస్తున్నట్లుగా చెబుతున్నారు. తన రాజకీయ అంశాలకు సంబంధించిన ఏర్పాట్లు.. సమాచార సేకరణ కోసం కొంతమందిని పవన్ నియమించుకున్నారు. వారిలో ఈనాడుకు చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే.. ఈమధ్య కాలంలో తెలుగులో పోస్ట్ చేస్తున్న ట్వీట్లలో కొన్ని పదాలు కేవలం ఈనాడు.. ఈనాడులోపని చేసిన జర్నలిస్టులు మాత్రమే తరచూ ఉపయోగించే పదాలు ఉండటం గమనార్హం. తమ వార్తలకు ఈనాడు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న వాదనను పవన్ సన్నిహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ.. ఆయన ట్వీట్లను తయారు చేస్తోంది.. ఈనాడులో ఒకప్పుడు పని చేసే వారు కావటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News