ప్రేమ : మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మ‌హ‌త్య‌

Update: 2018-06-15 08:03 GMT
ప్రేమ‌పెళ్లికి ఒప్పుకోలేద‌ని బనగాన పల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డి కుమారుడు కాటసాని నాగార్జున రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగుళూరులో ఉంటున్న నాగార్జున రెడ్డి ఓ అమ్మాయిని ప్రేమించిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంలో ఇంట్లో తెలియ‌జేసి వారి ఆమోదంతో పెళ్లి చేసుకోవాల‌ని అనుకుని వారికి త‌న ప్రేమ విష‌యం తెలిపాడ‌ట‌. అయితే త‌ల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోక‌పోవ‌డంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తుంది.

గత రాత్రి తన తండ్రితో కలసి బెంగళూరు నుంచి బనగానపల్లికి వచ్చిన నాగార్జున రెడ్డి మ‌రోసారి త‌న ప్రేమ పెళ్లి విష‌యమై అడిగగా తండ్రి ఒప్పుకోక‌పోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వివాదం జ‌రిగిన‌ట్లు స‌మాచారం. దీంతో తీవ్రంగా క‌ల‌త చెందిన నాగార్జున రెడ్డి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

ఎమ్మెల్యేగా ప‌నిచేసిన రామ్ రెడ్డి త‌న కుమారుడి ప్రేమ‌ను అంగీక‌రించ‌క అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకునే వ‌ర‌కూ స‌మ‌స్య‌ను లాగ‌డం బాధాక‌రం. ప్ర‌జాప్ర‌తినిధిగా అంద‌రికీ మార్గ‌ద‌ర్శకంగా నిల‌వాల్సిన ఆయ‌న సొంత కొడుకునే పోగొట్టుకుని క‌డుపుకోత మిగుల్చుకున్నారు. ఏద‌యినా స‌మ‌స్య‌కు సామ‌ర‌స్య పూర్వ‌క ముగింపు ఇచ్చి ఉంటే ఈ రోజు ఈ ప‌రిస్థితి వ‌చ్చి ఉండేది కాదు.
Tags:    

Similar News