సోషల్ మీడియా అన్నంతనే గుర్తుకు వచ్చేవి ఫేస్ బుక్.. ట్విట్టర్. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం మీద బోలెడన్ని సంస్థలు ఉన్నప్పటికీ ఈ రెండింటికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాలో కీలక భూమిక పోషించే ఈ సంస్థలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిమ్మ తిరిగేలా షాకిచ్చారు.
కొద్ది రోజుల్లో వైట్ హౌస్ లో అన్ని సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో ఒక సదస్సును ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ కారణంగా ఎదురవుతున్న సమస్యలపై ఇందులో చర్చించనున్నారు. ఇంతటి కీలకమైన సదస్సుకు ముఖ్యమైన ఫేస్ బుక్ .. ట్విట్టర్లకు ఆహ్వానం పంపకపోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దిగ్గజ కంపెనీలను పిలవకుండా ట్రంప్ ఏం సాధిస్తారన్నది ఒక ప్రశ్నగా మారింది.
ఇంతకీ.. ఈ దిగ్గజ కంపెనీలకు ట్రంప్ ఆహ్వానం పంపలేదన్న విషయంలోకి వెళితే.. ట్రంప్ ప్రాతినిధ్యం వహించే రిపబ్లికన్ల భావాల్ని ఈ రెండు కంపెనీలు గౌరవించటం లేదన్న విమర్శల్ని ఆయన తరచూ చేస్తుంటారు. ట్రంప్ నిర్వహించే సదస్సుకు ఏయే సంస్థలు పాల్గొంటున్నాయన్న వివరాలు బయటకు రావట్లేదు.
మరికొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ.. సోషల్ మీడియా సంస్థలతో సదస్సు ఏర్పాటు చేయటం ఆసక్తికరంగా మారింది. ఎందుకిలా అంటే.. ఓటర్లను ప్రభావితం చేయటంలో సోషల్ మీడియా కీలకంగా మారిందన్న మాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ తో ట్రంప్ కు పెద్దగా పంచాయితీ లేకున్నా.. ట్విట్టర్ తో మాత్రం అమెరికా అధ్యక్షుడికి కాస్తంత రగడ ఉందని చెప్పాలి. తన అకౌంట్లో ఫాలోవర్లు ఉన్నట్లుండి ఎందుకు తగ్గిపోతున్న విషయాన్ని ట్విట్టర్ సీఈవోతో భేటీ సందర్భంగా అడగటం.. ఆయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదన్న గుర్రు ఉంది. ఏమైనా.. దిగ్గజ సంస్థలకు ఇన్విటేషన్ పంపకుండా సోషల్ మీడియా సదస్సును నిర్వహించటంలో అర్థం లేదన్న మాట వినిపిస్తోంది. మరి.. సదస్సు జరిగే నాటికి ట్రంప్ నిర్ణయంలో ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి.