క‌న్నా..రాజ‌కీయం..రైతులు న‌వ్విపోతున్నారుగా...!

Update: 2019-08-28 10:00 GMT
రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ గ్రేట్ పొలిటీషియ‌న్‌. సుదీర్ఘ కాలం ఆయ‌న రాజ‌కీయాల్లో ఆరితేరాడు. దీంతో ఏ ఎండ‌కు ఆ గొడుగును ప‌ట్ట‌డంలోను - ఏది జ‌రిగినా.. త‌న‌కు అన‌కూలంగా మార్చుకోవ డంలోను త‌న స‌త్తా చూపుతున్నార‌నే వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ఇప్పుడు సొంతం చేసుకుంటున్నారు. నిజానికి రాజ‌కీయాల్లో ట్రిక్స్ ఎక్కువ‌గా ఉంటాయి. గ‌తంలోనూ ఇవి క‌నిపించాయి. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మయంలో త‌న‌కు వ్య‌తిరేక‌త ఎదురైనా.. దాని నుంచి కూడా ఆయ‌న ల‌బ్ధి పొందాల‌ని - ప్ర‌జ‌ల్లో సింప‌తీ సాధించాల‌ని చూసేవారు. ఇప్పుడు ఫ‌క్తు ఇలానే వ్యూహాత్మ‌కంగా పాలిట్రిక్స్ చేస్తున్నారు క‌న్నా.,.

విష‌యంలోకి వెళ్తే.. రాజ‌ధాని అమ‌రావ‌తిలో రైతులు కొద్దిరోజులుగా ఆందోళ‌న చేస్తున్నారు. త‌మ‌కు కౌలు డ‌బ్బులు చెల్లించ‌లేద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో రాజ‌కీయ నేత‌ల‌ను వారు క‌లుస్తున్నారు. వారి ఆవేద‌న‌ను పంచుకుంటున్నారు. అధికార‌ - విప‌క్ష నేత‌ల చుట్టూ బొంగ‌రం తిరిగిన‌ట్టు తిరుగుతున్నారు. ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత త‌మ‌కు డ‌బ్బులు వ‌స్తాయో రాదో అని ఆందోళ‌న‌కు కూడా గుర‌య్యారు. ఈ క్ర‌మంలోనే త‌మ‌కు అందుబాటులో ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను కూడా క‌లిసిన వారు త‌మ కౌలు సొమ్మును ఇప్పించాల‌ని - జ‌గ‌న్‌ తో సంప్ర‌దించాల‌ని సూచించారు. ఈ నేప‌థ్యంలో క‌న్నా.. ప్ర‌భుత్వానికి ఉత్త‌రాలు రాశారు.

ఇక‌, ఇదే విష‌యంపై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను కూడా క‌లిసిన రైతులు త‌మ గోడు చెప్పుకొన్నారు. ఇదే విష‌యాన్ని క‌న్నా.. గ‌డిచిన రెండు రోజులుగా చెబుతున్నారు. అమ‌రావ‌తిలో రైతులు ఆందోళ‌న చేస్తున్న‌ది.. కేవ‌లం కౌలు డ‌బ్బుల కోస‌మేన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ అమెరికా నుంచి తిరిగి రాగానే దీనికి సంబందించిన 187 కోట్ల రూపాయ‌ల‌ను తాజాగా నిన్న విడుద‌ల చేశారు. దీంతో కౌలు రైతుల అకౌంట్ల‌లో నేటి నుంచి ఆ డ‌బ్బులు జ‌మ అవుతున్నాయి. అయితే, దీనిని కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు క‌న్నా ట్రిక్స్‌ కు తెర‌దీశారు.

కౌలు రైతుల విష‌యంపై తాను జ‌గ‌న్ కు లేఖ రాశాన‌ని - ఈ క్ర‌మంలోనే ఆయ‌న స్పందించి నిధులు విడుద‌ల చేశాడ‌ని అంటూ..  జ‌గ‌న్‌ కు థాంక్స్ చెప్పి ఈ ఫ‌లితాన్ని తన అక్కౌంట్ లో వేసుకున్నాడు.  ఓకే ఇది నిజ‌మే అయితే.,. మ‌రి ఏపీకి ప్ర‌త్యేక హోదా... పోల‌వ‌రానికి ఇబ్బడి ముబ్బ‌డి నిధులు కూడా ఇవ్వాల‌ని ఇక్క‌డి రైతులు ఆయ‌న‌ను ఇప్పుడు కోరుతున్నారు., ఆయ‌న చేసిన ట్వీట్‌ కు ప్ర‌తి ట్వీట్ చేస్తున్నారు. కేంద్రంలోని మీ ప్ర‌భుత్వానికి నేరుగా లేఖ‌రాయి.. క‌న్నా.. అంటూ సూచిస్తున్నారు. జ‌గ‌న్ ఔదార్యంతో చేసిన ప‌నిని కూడా మీ ఖాతాలో వేసుకున్నందుకు ధ‌న్య‌వాదాలు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
Tags:    

Similar News