ఎమ్మెల్యేను తాడుతో కట్టేశారు... ఎందుకంటే!

Update: 2015-07-20 05:21 GMT
ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులు ఒక ఎమ్మెల్యే, ఒకరు కౌన్సిలర్! తాళ్ల తో కట్టబడ్డారేమిటి? దొంగ తనం చేశారా, లేక మరేదైనా పనిచేస్తూ దొరికిపోయారా అనుకోకండి! ఇది ప్రజాచైతన్యం తాలూకు ప్రతిఫలం! ఎన్నికల సమయంలో చెప్పిన వాగ్ధానాలు నెరవేర్చకుండా, ఆయా ప్రాంతాలకు అవసరమైన కనీసం అవసరాలు నీరు, విద్యుత్ లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు! దీంతో ఆగ్రహానికి గురైన ప్రజలు... ఆ ప్రాంతంలో పర్యటించడానికి వచ్చిన ఎమ్మెల్యే ను, కౌన్సిలర్ ను కూడా నిర్భందించారు. కుర్చీకి తాళ్ల తో కట్టి... వారి వారి సమస్యలు అన్నీ అక్కడే పరిష్కరించాలని కోరారు. దీంతో ఈ విషయం దావాణంలా ఆ ప్రాంతమంతా పాకేసింది. గతంలో ఆ గ్రామానికి రూ. 80 లక్షల నిధులు మంజూరు అయినా కూడా ఇప్పటివరకూ ఎటువంటి పనులు చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతోనే ఈ పనికి పాల్పడ్డారని తెలిసి, గ్రామస్థులతో మాట్లాడి ఎమ్మెల్యే ను, కౌన్సిలర్ ను విడిపించారు. మరో విషయం ఏంఇటంటే... తనను నిర్భందించారని కానీ, దాడికి పాల్పడ్డారని కానీ ఆ ఎమ్మెల్యే బబ్బన్ సింగ్ ఎస్పీ కి ఎటువంటి ఫిర్యాదు చేయలేదు!

ఇటువంటి పనులుచేయడం కరెక్ట్టా, కాదా అనే విషయం కాసేపు పక్కన పెడితే... ఎన్నికల సమయంలో వాగ్ధానాలు చేయడంలో చూపించే ఉత్సాహం, పడే పోటీ... ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాటిని నెరవేర్చడంలో చూపించని రాజకీయ నాయకులు ఇది ఒక ఉదాహారణగా మాత్రం బావించొచ్చు! ఈ ఉత్సాహం ప్రతీ గ్రామంలోని ప్రజలకూ వస్తే మాత్ర... ప్రపంచంలోని అగ్రరాజ్యంగా, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారిపోవడం ఖాయం!!
Tags:    

Similar News