దీపావళి ప్రతి ఒక్కరికి ఇష్టమైన పండుగల్లో ఇది కూడా ఒకటి. దీపావళి రోజు చెవులకి తూట్లు పడేలా పటాకులు కలుస్తుంటారు.అందరూ కాల్చినట్టు నేను కాలుస్తే అందులో ఏముంది కిక్కు అనుకున్నాడో ఏమో కానీ .. రియల్ గన్ తో కుటుంబ సభ్యులతో దీపావళి ని సెలెబ్రేట్ చేసుకున్నాడు. అబ్బా ఇదేదో బాగుందే అనుకుంటున్నారా .. ఆ గన్ పేల్చుతూ ఉన్నవారికి ఎటువంటి భయం అక్కర్లేదు . కానీ , ఆ ఇంటి చుట్టుపక్కల వారు ఆ బుల్లెట్స్ ఎక్కడ వచ్చి తగులుతాయో అని దీపావళి బ్రతికివుంటే వచ్చే ఏడాది అయినా జరుపుకోవచ్చు అనుకోని ..ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు. ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
బహిరంగ ప్రదేశంలో వారు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి దీపావళి చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని బరేలీ ఇజ్జత్‌నగర్ ప్రాంతానికి చెందిన అజయ్ మెహతా కుటుంబ సభ్యులు దీపావళి సందర్భంగా బయటికి వచ్చి తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ వీడియోల్లో అజయ్ మెహతా కాల్పులు జరుపుతూ.. కాలిస్తే నీకు ఏమైంది అంటూ షోలే సినిమాలోని డైలాగ్‌ను పలికారు. అజయ్‌తో పాటు ఆయన భార్య కూడా కాల్పులు జరిపినట్లు వీడియోలు గుర్తించారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆయనను సంప్రదించగా తాము బొమ్మ తుపాకీతో కాల్చామని చెప్పారు. ప్రస్తుతం ఆయన్ను స్టేషన్‌కు రమ్మని పిలిచారు. ఆ తుపాకీ నిజమైనదేనని తేలితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని ,తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏమైనా కూడా దీపావళి రోజు వెరైటీగా ఉండాలి అని చేసిన ఆ ప్రయత్నం వారిని ఇప్పుడు ఇబ్బందులకు గురిచేసింది. జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియా మిమ్మల్ని అనుక్షణం చూస్తూనే ఉంటుంది.