ఆ కారణంగా నేను ఆర్సీబీని వీడిపోవాలని : విరాట్ కోహ్లీ !

Update: 2021-04-09 13:30 GMT
విరాట్ కోహ్లీ .. ప్రపంచ క్రికెట్ లో పరిచయం అక్కర్లేని పేరు. రన్ మిషన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మ్యాచ్ ఏదైనా, స్టేడియం ఎక్కడైనా , బౌలర్ ఎవరైనా కూడా పరుగుల వరద పారించడమే విరాట్ నైజం. ఒక్కసారి ఉపందుకుంటే విజయం తథ్యం. ప్రతి మ్యాచ్ కూడా విజయం సాధించాలనే కసి తో ఆడతాడు. ఇదంతా జాతీయ జట్టుకి ఆడే సమయంలో కానీ, ఐపీఎల్ లో ఆటగాడిగా అద్భుతంగా ఆడుతున్నప్పటికీ , ఓ కెప్టెన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు. ఐపీఎల్ ప్రారంభం అయ్యాక , ఆర్ సి బి ఇప్పటివరకు కప్ కొట్టలేదు. ఐపీఎల్ సీజన్ మొఅదలయ్యే ప్రతీసారి 'ఈసాల కప్ నందే' అంటూ బరిలోకి దిగే రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు దురదృష్టం  వెంటాడుతోంది. ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ  ఆ జట్టు గెలవలేదు. ఐపీఎల్ కప్ రాయల్ ఛాలెంజర్స్ కి  అందని ద్రాక్షే అయ్యింది.  

ఆర్సీబీ మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిందే తప్ప ఒక్కసారి కూడా ఐపీఎల్‌ విజేతగా నిలవలేదు. కోహ్లి సహా క్రిస్‌ గేల్‌, ఏబీ డివిలియర్స్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేక చతికిలపడింది. గతేడాది ప్లే ఆఫ్‌ కు అర్హత సాధించిన ఆర్సీబీ, ఎలిమినేటర్‌ మ్యాచ్ ‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓడి లీగ్‌ నుంచి నిష్క్రమించింది. అయితే, ఈసారి కప్‌ కొట్టాలన్న కసి మీద కోహ్లి సేన, డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ తో ఆడనున్న తొలి మ్యాచ్‌ లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీతో తనకున్న అనుబంధం గురించి కోహ్లి మాట్లాడుతూ... ఇరు జట్లకు ఉన్న ఫ్యాన్‌ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నేటి మ్యాచ్‌లో మాకు కచ్చితంగా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. జట్టుగా ప్రతిసారి మేం మనసు పెట్టి ఆడుతున్నాం. ఇంతవరకు ఎక్కడా రాజీపడలేదు. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే కృషి చేశాం. నిబద్ధతగా ఆడుతూనే ఉన్నాం. అయితే, ఇంతవరకు మేం ఇంతవరకు ఒక్క టైటిల్‌ కూడా సాధించలేదన్న కారణంగా నేను ఆర్సీబీని వీడిపోవాలని అనుకోలేదు. గెలుపోటములు ఆటలో సహజం అని అన్నారు. నిజానికి నాపై వాళ్లు ఎప్పుడూ ఒత్తిడి పెట్టలేదు. ఫ్రాంఛైజీని వీడేలా మాట్లాడలేదు కూడా. మా మధ్య అసలు అలాంటి సంభాషణే జరుగలేదు.  నాకు ఇక్కడ ఉన్నంత సౌలభ్యం మరెక్కడా ఉండదని చెప్పగలను. ఆర్సీబీతో అనుబంధం అద్భుతం’’ అని చెప్పుకొచ్చాడు.

 2013 నుంచి ఆర్సీబీకి నేతృత్వం వహిస్తున్న విరాట్ కోహ్లీ ఎలాగైన జట్టుకు ఈ సారి కప్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఆర్‌సిబి గత 8 సీజన్లలో మిశ్రమంగా రాణించింది. ఒక్కసారి మాత్రమే ఫైనల్ చేరుకున్నారు. 2013 నుండి రెండుసార్లు మాత్రమే క్వాలిఫైర్ మ్యాచ్‌లు ఆడారు.ఐపీఎల్ 2021 ఎలిమినేటర్ రౌండ్ వరకు ఆడారు. నాకౌట్ మ్యాచ్‌లో ఆర్‌సిబి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. ఐపిఎల్ 2021 వేలంలో ఆల్ రౌండర్లు గ్లెన్ మాక్స్వెల్, కైల్ జామిసన్ లపై ఆర్‌సిబి పెద్ద మొత్తంలో ఖర్చు చేసి వెచ్చించి కొనుగొలు చేసింది. ఈ ఏడాది కూడా జట్టులో బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది. దేవ్‌దత్ పాడికల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించినున్నారు.
Tags:    

Similar News