అశోక్‌ గజపతి రాజు వారసురాలు వస్తోంది

Update: 2019-03-19 16:17 GMT
తెలుగుదేశం పార్టీలో మొన్నటివరకు ఒక రూల్ ఉండేది. ఒక ఫ్యామిలీ నుంచి ఒకరికే టిక్కెట్‌ అని. కానీ ఈసారి ఎన్నికల్లో తన ఫ్యామిలీ నుంచే నాలుగు టిక్కెట్లు ఇవ్వాల్సి రావడంతో.. ఆ రూల్‌ ని ఈ ఒక్కసారికి పక్కన పెట్టేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తన కుటుంబంలో చంద్రబాబు - లోకేష్‌ - బాలయ్య - శ్రీభరత్‌ ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. ఒక్క చంద్రబాబు కుటుంబం నుంచే కాదు.. ఈసారి చాలామంది కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నారు. తమ పార్టీనుంచి రెండు మూడు టిక్కెట్లకు పైగా సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్‌ లో చేరారు మాజీ మంత్రి విజయనగరం రాజావారు అశోక గజపతిరాజు.

అశోక గజపతిరాజు ప్రస్తుత విజయనగరం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీంతో.. ఇదే మంచి సమయం అనుకుని తన రాజకీయ వారసురాలిగా తన కుమార్తెను రంగంలోగి దింపారు. అశోక గజపతిరాజు కుమార్తె అదితి గజపతి.. ఈ ఎన్నికల్లో విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. తన తండ్రిని ఎలా అయితే రాజకీయాల్లో ఆదిరించాలో తనని కూడా అలాగే ఆదరించాలని కోరుతున్నారు అదితి గజపతి. అలాగే గజపతి కుటంబానికే చెందిన ఆనంద గజపతిరాజు కుటుంబానికి చెందిన సంచిత గజపతి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆమెకూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగేందుకు సమాయత్తం అవుతున్నారు. మొత్తానికి గజపతి కుటుంబం నుంచి ఈసారి ముగ్గురు బరిలో ఉన్నారన్నమాట.
Tags:    

Similar News