జీఎస్టీ కాదు కానీ : పన్నీరు, బటర్, మసాలా జోక్ పేలుతోందిగా...

Update: 2022-07-21 23:30 GMT
జీస్టీ ఇపుడు ఎన్నో జోక్స్ కి మీంస్ కి కారణం అవుతోంది. కాదేదీ జీఎస్టీకి అనర్హం అన్న తీరున దేనినీ వదలకుండా జీఎస్టీని విధించి పారేశారు. దాంతో జీఎస్టీ విధింపు మీద వచ్చినన్ని జోక్స్ ఈ మధ్య కాలంలో ఎక్కడా రాలేదేమో. అది జనాల ధర్మాగ్రహంగానే చూడాలని అంటున్నారు.

జీఎస్టీని ఆహార ప‌దార్థాల‌పై వ‌స్తు, సేవ‌ల ప‌న్ను విధిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు మంటెత్తిపోతున్నారు. ఈ జీఎస్టీ కాదు కానీ అంటూ చీల్చిచెండాడుతున్నారు. దీని మీద మీమ్స్ తో పాటు గణిత శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతూ జనాలు కట్ చేస్తున్న జోక్స్ ఎన్నో ఉన్నాయి.

ఇలా జీఎస్టీ మీద వస్తున్న జోక్స్ లో కాంగ్రెస్ కి చెందిన సీనియర్ నేత. మాజీ కేంద్ర మంత్రి శశిధరూర్ ఒక ఒక జోక్ తెగ నచ్చేసిందిట. దాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ ఈ వాట్సాప్ జోక్‌ను ఎవ‌రు పంపారో తెలియ‌దు కానీ, జీఎస్టీపై వ‌స్తోన్న అత్య‌ద్భుత జోకుల్లో ఒక‌టిగా ఇది నిలుస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

మరి ఆయనకు అంతలా నచ్చిన ఆ జోక్ ఏంటి అంటే ప‌న్నీర్‌పై జీఎస్టీ 5 శాతం, బ‌ట‌ర్ పై 12 శాతం, మ‌సాలాపై 5 శాతం ఉంది. ఇప్పుడు దీనిపై ఓ గ‌ణిత‌శాస్త్ర ప్ర‌శ్న వ‌చ్చింది. ప‌న్నీర్, బ‌ట‌ర్‌, మ‌సాలా పై జీఎస్టీ ఎంత  అంటూ ఆ పోస్ట్‌లో ఉంది. ఈ జోక్ వాట్సాప్‌లోనే కాకుండా అన్ని సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతుంది.

 నిజంగా ఇది బాధతో ఆవేదనతో నెటిజన్లు వేస్తునన్ జోక్ గా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీ ఏలుబడిలో ఆహార పదార్ధాల మీద జీఎస్టీ విధించడం అన్నది మాత్రం పెద్ద చర్చగానే కాదు, సగటు జనాల మండిపాటుకు కారణం అవుతోంది అని అంటున్నారు.

ప్యాక్‌ లేదా లేబుల్‌ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధిస్తారు. అలాగే, చెక్కుల జారీకి బ్యాంకులు వసూలు చేసే ఫీజుపై కూడా జీఎస్టీ అమలవుతుంది. ప్యాక్ చేసిన‌, లేబుల్డ్‌ ఆహార ఉత్పత్తులకు పన్ను మినహాయింపులను తొలగించాలని ఇటీవ‌ల కేంద్ర స‌ర్కారు నిర్ణ‌యించింది.
Tags:    

Similar News