మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయంగా ఊసరవెల్లి లా వ్యవహరిస్తుంటారు అన్న నానుడి 20 సంవత్సరాలుగా ఉంది. 1999లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన గంటా తర్వాత ప్రతి ఎన్నికకు పార్టీలు మారుతూ అధికారమే పరమావధిగా రాజకీయాలు చేశారు. 2004లో మంత్రి పదవిపై మోజుతో ఎంపీ సీటుని వదులుకొని చోడవరం ఎమ్మెల్యే గా గెలిచారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలోకి జంప్ చేసిన గంటా అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో మంత్రి పదవి దక్కించుకున్న ఆయన 2014 ఎన్నికలకు ముందు తిరిగి టిడిపిలోకి జంప్ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచి మరోసారి చంద్రబాబు కేబినెట్ లో ఐదేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు.
గత ఎన్నికలకు ముందు భీమిలి సీటు వదులుకొని విశాఖ నగరంలోని నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా చావుతప్పి కన్నులొట్టబోయినట్లు గెలిచారు. గంటా రాజకీయ జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తే ప్రతి ఎన్నికలలో నియోజకవర్గం మారటం.. అధికారం ఎక్కడ ఉంటే అటువైపు జంప్ చేయడం ఆయనకు అలవాటు అయిపోయింది. ప్రస్తుతం నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఐదేళ్లపాటు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండే ఆయన ఆ వ్యతిరేకతను అధిగమించేందుకు మళ్ళీ కొత్త నియోజకవర్గం వెతుక్కుంటున్నారు. గంటా ఇదో స్ట్రాటజీ గా పెట్టుకుంటూ వస్తున్నారు.
విశాఖ నార్త్‌లో గంటా టిడిపి కేడర్‌ను గాలికి వదిలేయడంతో జీవిఎంసి ఎన్నికల్లో అక్కడ టీడీపీ ఘోర పరాజయం పాలైంది ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో అప్పటి టిడిపి పరిస్థితిని బట్టి తిరిగి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే తోడళ్లుల్లు అయినా నారా లోకేష్, భరత్ ఇద్దరు గంటాకు చెక్ పెట్టే వ్యూహం రూపొందించారు. గత ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే... భరత్ విశాఖ ఎంపీగా స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక లోకేష్ వచ్చే ఎన్నికల్లో వైజాగ్ నుంచి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. చివర్లో ఆయన రాజధాని ఏరియా నుంచి బరిలో ఉంటే భీమిలి నుంచి భరతే పోటీ చేస్తారని టాక్ ? ఏదేమైనా గంటాకు వీరిద్దరు కలిసి చెక్ పెడుతున్నారు.
ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచే పోటీ చేస్తే నార్త్ నుంచే పోటీ చేయాలి. మళ్లీ నియోజకవర్గం మారతా ? టీడీపీ కంచుకోట అయిన భీమిలి వెళతా ? అంటే కుదిరేలా లేదు. అందుకే అప్పటి వరకూ ఇన్చార్జ్ తో కథ నడిపించాలని భీమిలి మాజీ ఎంపీపీ కోరాడ రాజబాబుకు భీమిలి పార్టీ పగ్గాలు అప్పగించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గంటా ఆడుతోన్న డ్రామాలకు ఇది లోకేష్ మార్క్ చెక్ అని స్థానికంగా వినిపిస్తోన్న టాక్ ?