మధ్యప్రదేశ్ రాష్ట్రం జబువాలోని సేథియా రెస్టారెంట్ లో సిలిండర్ పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 83కు చేరుకుంది. ఈ పేలుడులో మరో 100 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మరో వైపు ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
జబువాలోని ఓ హోటల్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ లీకై ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో హోటల్ కుప్పకూలింది. దీంతో హోటల్ ఉన్న సిబ్బంది తో సహా అల్పాహారం సేవిస్తున్న వారు మృతి చెందారు. మరికొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. అందరూ చూస్తుండగానే హోటల్ కాలిబూడిదైంది.
కాగా ఈ ప్రమాదం కారణంగా హోటల్ కూలి పక్కనే ఉన్న మరో రెండు భవంతులపై పడడంతో అవి కూడా దెబ్బతిన్నాయి. వాటిలో ఉన్నవారు కూడా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని అక్కడున్నవారు చెబుతున్నారు. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదం మధ్య ప్రదేశ్ లో తీవ్ర విషాదం నింపింది.