అవును! ఊరకరారు మహానుభావులు! అన్నట్టుగా వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేస్తున్న జిలానీల వరుసలో చేరిపోయిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.. పార్టీ మార్పునకు ముందు ఎన్నినీతులు చెప్పినా.. అసలు విషయం కొంచెం లేటయినా.. ప్రపంచానికి తెలిసిపోయింది. జగన్ తనకు దైవమని, ప్రాణమని ఎన్నో నీతులు చెప్పిన ఈశ్వరి.. గిరిజనుల సంక్షేమం కోసం అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నానని, వైసీపీలో తనకు అవమానం జరిగిందని పెద్ద పెట్టున ఏవేవో ఆరోపణలు చేసింది. ఇంత చేస్తే.. మీరు నన్ను ఇలా చేస్తారా? అంటూ జగన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. అయితే, మొదట్లో ఈశ్వరి చెప్పినవన్నీ నిజమేనని అనుకున్నారు అందరూ. జగన్ వ్యవహార శైలి కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి ఆమెను తప్పు పట్టాల్సిన అవసరం లేదని కూడా కొందరు భావించారు.
అయితే, పార్టీ నుంచి జంప్ చేయడానికి ఒక్కరోజు ముందు పాడేరులో తన కార్యకర్తలు, మద్దతు దారులతో ఈశ్వరి చేసిన సంభాషణ.. ఆమె ఏ కారణంతో పార్టీ మారిందో స్పష్టం చేస్తోంది. బాబు ఆమెను ఎలా ట్రాప్‌లోకి దించాడో తెలుస్తోంది. "చంద్రబాబు అంటే నాకేమీ ఇష్టమని వెళ్లడం లేదు. వెళ్లాలని కూడా లేదు. డిఫర్ అవడం వల్లనే వెళ్లాల్సి వస్తోంది. నేను ఏం చెబుతున్నానంటే, మంత్రివర్గ విస్తరణ రేపు జరిగితే రేపు, ఎల్లుండి జరిగితే ఎల్లుండి మంత్రి పదవిని ఇస్తామన్నారు.. వెంటనే మంత్రి పదవి ఇవ్వలేరు కాబట్టి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని క్యాబినెట్ హోదాతో ఇస్తామన్నారు. రాష్ట్రంలోని మంత్రికి ఉన్నటువంటి పవర్స్ అన్నీ ఇస్తామన్నారు కాబట్టే వెళ్తున్నా" అని ఈశ్వరి తన కార్యకర్తలను సముదాయిస్తున్న వీడియో తాజాగా వెలుగు చూసింది.
ఇప్పుడు వైఎస్ఆర్ సీపీ నుంచి బయటకు వెళ్లవద్దని కార్యకర్తలు అంటుంటే, వారికి ఈశ్వరి నచ్చజెప్పారు. ఎమ్మెల్యేగా ఏడాది సమయం ఉంటుంది కాబట్టి, పనులు చక్కబెట్టుకుందామని ఆమె అంటున్నట్టు ఈ వీడియోలో ఉంది. తాను మాట్లాడుతున్న వీడియోను తీస్తున్నారని గమనించిన ఆమె, "అంతా మనవాళ్లే ఉన్నారా? ఎవరైనా వీడియో తీస్తున్నారేమో చూడండి" అంటూ కంగారు పడ్డారని దీనిని వెలుగులోకి తెచ్చిన జగన్ మీడియా పేర్కొంది. మొత్తానికి గిడ్డి ఈశ్వరి వాయిస్ ఈ వీడియోలో స్పష్టంగా ఉండడం గమనార్హం. మరి సంచలనం రేపుతున్న ఈ వీడియో రాబోయే రోజుల్లో మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Full View