అర్థరాత్రి అతగాడి పనిని.. స్మార్ట్ వాచ్ చెప్పేస్తే..ఆమె బ్రేకప్ చెప్పింది

Update: 2021-03-23 09:30 GMT
టెక్నాలజీ అందుబాటులోకి రావటం మంచిదే అయినా.. మనం వేసే ప్రతి అడుగును ఎక్కడో ఒక చోట రిజిస్టర్ చేసే పరిస్థితి. దీంతో.. తప్పు చేస్తే అడ్డంగా బుక్ కావటం క్షణాల్లో పని. అలాంటి ఉదంతమే తాజాగా చోటు చేసుకుంది. టెక్నాలజీ పుణ్యమా అని తన బాయ్ ఫ్రెండ్ చేసిన చెత్త పని తనకు తెలిసేలా చేసిందని పేర్కొంది. అంతేకాదు.. ఆ వెంటనే బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పేసింది.

నదియా ఎసెక్స్ అనే టిక్ టాక్ యూజర్ తన ప్రియుడు చేసిన ఘనకార్యం గురించి చెప్పటమే కాదు.. దాన్ని తాను ఎలా గుర్తించానన్న విషయాన్ని ఆసక్తికరంగా వెల్లడించింది. తన బాయ్ ఫ్రెండ్ ఒక రోజు రాత్రంతా నైట్ అవుట్ చేశాడని.. అర్థరాత్రి 2 గంటల సమయంలో 500 కేలరీలు ఖర్చు చేసిన విషయాన్ని ఆమె గుర్తించారు. అదెలా అంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఆమె.. ఆమె ప్రియుడు ఇద్దరు స్మార్ట్ వాచ్ లు కొనుక్కోవటం.. ఒకరి వివరాలు మరొకరికి తెలుసుకునేలా పెయిర్ చేసుకున్నారు.

అతడి స్మార్ట్ వాచ్ లో ఫిట్ బిట్ అనే యాప్ ఉంది. అందులోనమోదయ్యే సమాచారం ఆమెకు అందుతుంది. అలా ఒక రోజు ఉదయాన్నే ఫోన్ చూసుకున్నంతనే.. తన బాయ్ ఫ్రెండ్ తెల్లవారుజామున 2 గంటల సమయంలో 500 కేలరీలు ఖర్చు చేసిన మెసేజ్ చూసి షాక్ తిన్నది. అనంతరం చెక్ చేసుకోవటంతో అతగాడు మరో మహిళతో సెక్సు చేసిన విషయాన్ని గుర్తించింది. దీంతో.. ఒళ్లు మండిన ఆమె బ్రేకప్ చెప్పేసినట్లు వెల్లడించింది. రానున్న కాలంలో అందుబాటులోకి వచ్చే ఇలాంటి టెక్నాలజీల పుణ్యమా అని తప్పు చేస్తే.. ఇట్టే దొరికిపోవటం ఖాయం. 
Tags:    

Similar News