కరోనా నుండి బయటపడ్డ వుహాన్ సిటీ !

Update: 2020-03-19 08:30 GMT
ప్రపంచంలో ఉన్న మానవాళిని భయాందోళనకు గురిచేస్తోన్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌ లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఒక్కో దేశానికి వ్యాపిస్తూ.. ప్రపంచ దేశాలను కరోనా గజగజ వణికిస్తోంది. అయితే వైరస్ బయటపడిన వుహాన్‌ లో మాత్రం పరిస్థితి క్రమ క్రమంగా మెరుగవుతోంది. బుధవారం వూహన్ లో ఒక్క పాజిటివ్ కూడా నమోదుకాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి ప్రధాన కారణం అక్కడి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్త చర్యలే అని చెప్పవచ్చు. వైరస్ వ్యాప్తి చెందిన దేశాల్లో పాజిటివ్ కేసులే కాదు.. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అయితే ఇతరదేశాల నుంచి వచ్చినవారికి మాత్రం కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించామని అధికారులు చెప్తున్నారు.

వుహాన్‌ సిటీలో కొత్తగా ఎవరికీ కరోనా పాజిటివ్ రాకపోయినప్పటికీ, ఇతరదేశస్తులకు వైరస్ సోకడం తో అక్కడి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ దృష్ట్యా ఎయిర్‌ పోర్టులలో మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టారు. బుధవారం చైనాలో వుహాన్ నగరం మినహా  34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. అయితే ఇది మంగళవారం తో పోలిస్తే రెట్టింపు సంఖ్య అని చెప్పాలి. మంగళవారం 13 కరోనా పాజిటివ్ కేసులు బయటపడగా.. బుధవారం నాటికి ఆ సంఖ్య 34కి చేరింది.

ఈ 34 కేసుల్లో 21 బీజింగ్‌ లో నమోదు కాగా, మరో 13 కేసులు ఇతర దేశాల నుంచి వచ్చిన వారి అని ఆరోగ్య కమిషన్ తెలిపింది. చైనాలో 80 వేల 928 మందికి వైరస్ సోకిందని ,వీరందరికీ చికిత్స అందిస్తున్నామని వెల్లడించింది. కరోనా వైరస్ సోకి దేశంలో ఇప్పటివరకు 3 వేల 245 మంది చనిపోయారని.. బుధవారం మరో 8 మంది చనిపోయారని చైనా అధికారులు తెలిపారు. ఇక మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలకి దాటిపోయింది.
Tags:    

Similar News