టీడీపీ టాక్స్ : శ్రీ‌కాకుళం శిరీష త‌గువులో కొత్త ట్విస్టు !

Update: 2022-06-07 16:30 GMT
టీడీపీ టాక్స్ : శ్రీ‌కాకుళం శిరీష త‌గువులో కొత్త ట్విస్టు !

డాక్ట‌రుగా మంచి పేరుంది మంత్రి  సీదిరికి కానీ మంత్రిగా మాత్రం అస్స‌లు మంచి పేరు ఉండ‌డం లేదు అన్న‌ది సోష‌ల్ మీడియాలో నడుస్తున్న చర్చ. అన్ కంట్రోల్డ్ మినిస్ట‌ర్ గా ఆయ‌న దూసుకుపోతు న్నా, విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల అమ‌ల్లో భాగంగా స్థానికంగా రేగుతున్న వివాదాల‌ను మాత్రం ఆప‌లేక‌పోతున్నారు. ఒక‌విధంగా వాటికి ఆయ‌నే కార‌ణం అవుతున్నారు. ఇక శిరీష క‌థ‌లో కొత్త ట్విస్టు ఏంటి అన్న‌ది చూద్దాం.
 
సీఐడీ నోటీసులు, త‌రువాత విచార‌ణ‌లు వాటి తీరు ఎలా ఉన్నా  ప‌లాస రాజ‌కీయంలో ఏం జ‌రుగుతోంది. ప్ర‌శ్నిస్తే చాలు మంత్రి ఒప్పుకోవ‌డం లేదు. ఇంటెన్ష‌న్ ఏమ‌యినా స‌రే క‌నీసం మాట్లాడేందుకు క‌దా అవ‌కాశం ఇవ్వాలి. ఆ రోజు మాట్లాడే అవ‌కాశం లేకుండా ఉంటే ఇవాళ ఆయ‌న మంత్రి అయి ఉండేవారా అన్న ప్ర‌శ్న కూడా ఇప్పుడు టీడీపీ నుంచి వినిపిస్తోంది. ఓ సోష‌ల్ మీడియా పోస్టును ఫార్వ‌ర్డ్ చేసినంతనే రోజంతా విచార‌ణ చేశారు క‌దా! మ‌రి ! నిత్యం ఎన్నో ప్ర‌భుత్వ నిధులు ప‌క్క‌దోవ ప‌డుతున్నాయి వాటిపై ఏనాడ‌యినా విచార‌ణ చేసిన దాఖ‌లాలు.. నిందితుల‌ను అరెస్టు చేసిన దాఖ‌లాలు ఉన్నాయా అని టీడీపీ ప్ర‌శ్నిస్తోంది.

అదే సంతబొమ్మాళి మండ‌ల ప‌రిధిలో సంబంధిత ప‌రిస‌రాల్లో నిర్మితం అవుతున్న భావ‌న పాడు ఫిషింగ్ హార్బ‌ర్ కు సంబంధించి స్థ‌ల సేక‌ర‌ణ వివాదం కూడా నడుస్తోంది. మ‌రి ! దానిపై మాట్లాడినా మంత్రి ఒప్పుకుంటారో లేదో ! ఇది కూడా ఈ క‌థ‌కు రిల‌వెన్నీ ఉన్న‌దే  ! ఎందుకంటే భావ‌న‌పాడు పోర్టు ప‌నులు మంత్రి సీదిరి క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతున్న‌వే! ఇక్క‌డ ఫిషింగ్ హార్బ‌ర్ ఏర్పాటుకు సంబంధించి స్థ‌ల సేక‌ర‌ణ‌లో బోలెడు వివాదాలున్నాయి. ఇక్క‌డ ప్ర‌యివేటు భూమి సేక‌ర‌ణ అంత సులువు కాదు. కానీ బాధిత వ‌ర్గాల‌పై మంత్రి ఒత్తిడి పెంచుతున్నారే వీటిపై విచార‌ణ ఉంటే ఎంత బాగుండు అని కూడా అంటోంది టీడీపీ. టీడీపీతో పాటు ఇత‌ర సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు కూడా !

...........ఇంకా చెప్పాలంటే

వివాదానికి ఆరంభం ఏంటంటే....
 
ఎప్ప‌టి నుంచో ప‌లాస  నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి సీదిరి అప్ప‌ల్రాజుకు, ఆ ప్రాంత టీడీపీ ఇంఛార్జ్ గౌతు శిరీష‌కు మధ్య విభేదాలు న్నా యి. గ‌తంలోనూ సీదిరి అప్ప‌ల్రాజు వ‌ర్గాలు ఎప్భీ వేదిక‌గా ఆమెను అన‌రాని మాట‌లు అన్నారు. వాటిపై ఏనాడూ అధికార ప‌క్షం త‌ర‌ఫున పెద్ద‌గా కేసులు ఏమీ నమోద‌యిన దాఖలాలు లేవు. కానీ ఓ పోస్టును ఆమె ఫార్వ‌ర్డ్ చేశార‌న్న కార‌ణంగా సీఐడీ తాఖీదులు (నోటీసులు)అంందుకుని త‌రువాత ఆమె విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. అయితే ఇక్క‌డ పోలీసులు ఆమె ఉద్దేశాన్ని త‌ప్పు ప‌డుతున్నారా  లేదా చ‌ర్య‌ను త‌ప్పు ప‌డుతున్నారా ? అలా అయితే ఆ రోజు ఆమెను ఉద్దేశించి అత్యంత దిగ‌జారుడు భాష‌లో పోస్టులు రాసిన వారికి జైలు శిక్ష త‌ప్ప‌క వేయాల్సిందే.. కానీ ఆ విధంగా చేయలేదు క‌దా ! ఇదే ఈ క‌థ‌లో న‌యా ట్విస్ట్. అన‌గా అధికారం ఉంటే ఓ విధంగా లేకుంటే మ‌రో విధంగా అన్న మాట !

క‌నీస బాధ్య‌త మ‌రిచారా ?
 
రోజంతా నిన్న‌టి వేళ విజ‌య‌వాడ‌లో విచారించిన సీఐడీ పోలీసులు మ‌రియు ఇత‌ర ఉన్న‌తాధికారులు ఆమెకు క‌నీసం భోజ‌నం చేసే అవ‌కాశం కూడా ఇవ్వ‌లేదు. ఈ పాటి క‌నీస మర్యాద కూడా ఆమె విష‌య‌మై పాటించ‌లేక‌పోయారు. జైల్లో ఖైదీకి కూడా భోజ‌నం చేసే అవ‌కాశం ఉంటుంది క‌దా ! మ‌రి ! ఈమెకు ఎందుకు ? ఈ విధంగా చేశారు అన్న‌ది మ‌రో ప్ర‌శ్న. ముఖ్యంగా సీదిరి అప్ప‌ల్రాజు స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు గౌతు ల‌చ్చ‌న్న (శిరీష తాత‌) ను ఉద్దేశించి కూడా నోరు జారారు. త‌రువాత ఆయ‌న దిద్దుకున్న దాఖ‌లాలే లేవు. ము ఖ్యంగా అధికారం అడ్డం పె ట్టుకుని పలాస‌లో వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఏం చేసినా చెల్లుబాటు అయిన దాఖలాలే ఎక్కువ. అంటే ఇవ‌న్నీ మంత్రికి తెలియ‌కుండా జ‌రిగిపోతున్నాయా?


Tags:    

Similar News