400 టి20లు.. 4 జట్లపై 1000 పరుగులు.. ఒకే ఒక్కడు.. ఎవరో చెప్పుకోండి
2025.. టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లికి మూడు అరుదైన మైలురాళ్లు అందించింది.;

ఈ కాలంలో ఫామ్ ను నిలుపుకొంటూ.. ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ.. 100 మ్యాచ్ లు ఆడడం ఒక క్రికోటర్ కు కఠిన సవాలు.. కానీ, అతడు 100.. 200.. 300.. 400.. ఇలా వరుసపెట్టి ఆడేస్తున్నాడు.. అయితే, ఇవి అచ్చంగా లీగ్ మ్యాచ్ లు.. అంతర్జాతీయ మ్యాచ్ లకు ఇవి అదనం అన్నమాట.
2025.. టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లికి మూడు అరుదైన మైలురాళ్లు అందించింది. వీటిలో మొదటి ఇటీవలే అతడు 300 వన్డే ఆడడం.. టీమ్ ఇండియా విజేతగా నిలిచిన చాంపియన్స్ ట్రోఫీలోనే ఈ మ్యాచ్ ఆడడం. ఇదే టోర్నీలో కోహ్లి 14 వేల వన్డే పరుగుల మైలురాయిని చేరాడు.
వాస్తవానికి 2024లో కోహ్లి అంతర్జాతీయ టి20లకు గుడ్ బై చెప్పాడు. తన చివరి అంతర్జాతీయ టి20లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. పైగా ఇది టి20 ప్రపంచ కప్ లో కావడం విశేషం. ఇది కోహ్లికి 125వ అంతర్జాతీయ టి20 మ్యాచ్.
తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ కోహ్లికి 400వ లీగ్ టి20. కాగా, భారత ఆటగాళ్లకు విదేశీ టి20 లీగ్ లలో ఆడేందుకు అనుమతి లేని సంగతి తెలిసిందే.
కోహ్లి 2008 నుంచి పూర్తిగా ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ జట్టుకు కోహ్లి 253 మ్యాచ్ లలో ప్రాతినిధ్యం వహించాడు. చాంపియన్స్ లీగ్ లో ఆర్సీబీకి 15 మ్యాచ్ లు ఆడాడు.
కాగా మొత్తం 400 టి20ల్లో కోహ్లి 12945 పరుగులు చేశాడు.