పంజాబ్ మతబోధకుడి గురించి తెలిస్తే నోట మాట రాదంతే

ఒక వైరల్ చూసిన తర్వాత.. గుడ్డిగా నమ్మినోళ్ల విషయంలో ఒక మతబోధకుడి తీరుకు ఒళ్లు మండటంతో పాటు.. ఇలాంటివారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న భావన వ్యక్తమవుతోంది.;

Update: 2025-03-24 04:07 GMT

ఒక వైరల్ చూసిన తర్వాత.. గుడ్డిగా నమ్మినోళ్ల విషయంలో ఒక మతబోధకుడి తీరుకు ఒళ్లు మండటంతో పాటు.. ఇలాంటివారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న భావన వ్యక్తమవుతోంది. పంజాబ్ లోని జలంధర్ కు చెందిన ఒక మతబోధకుడి చేష్టలు షాకింగ్ గా మారాయి. అతడిపై లైంగిక ఆరోపణలతో పాటు.. మోసం చేశారన్న ఫిర్యాదును పోలీసులు అందుకున్నారు. తన ఆఫీసుకు వచ్చిన వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. వారిపై వస్తువుల్ని విసిరేయటంతో పాటు.. చేయి చేసుకునే వైనం చూస్తే.. వీడు అసలు మత బోధకుడేనా? అన్న సందేహం కలుగకమానదు. ఇంతకూ ఇతగాడి పేరేమిటో చెప్పలేదు కదా? అతడి పేరు బాజిందర్ సింగ్.

ఒక జాట్ కుటుంబంలో పుట్టిన ఈ పంజాబ్ వ్యక్తి.. పదేళ్ల క్రితమే మగబోధకుడిగా మారాడు. జలంధర్.. మొహాలిలలో ప్రార్థనా మందిరాల్ని ఏర్పాటు చేసిన ఇతగాడికి స్వల్ప వ్యవధిలో సోషల్ మీడియాలో లక్షలాది పాలోవర్లు ఉన్నారు. అయితే.. ఇతడి పాపులార్టీకి తగ్గట్లే బోలెడన్ని నేరారోపణలు ఇతడిపై తరచూ వస్తుంటాయి. తనను ఈ మతబోధకుడు వేధింపులకు గురి చేసినట్లుగా కపుర్తలాకు చెందిన 22 ఏళ్ల మహిళ పోలీసులకు కంప్లైంట్ చేశారు.

2017 నుంచి 2022 వరకు అతడి ప్రార్థనా మందిరాలకు తాను వెళ్లేదానినని.. తన తల్లిదండ్రులతో వెళ్లిన సమయంలో తన మొబైల్ నెంబరును తీసుకున్నాడని చెప్పారు. అప్పటి నుంచి తనకు ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టేవాడని.. ఆదివారాల్లో తన క్యాబిన్ కు పిలిపించుకొని ఒంటరిగా కూర్చోబెట్టేవాడని.. ఆ టైంలో చాలా అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

లైంగిక వేధింపులతో పాటు.. డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. తన కుమార్తె ఆరోగ్యాన్ని బాగు చేస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసినట్లుగా మరో కేసు కూడా ఇతడిపై ఉంది. తాజాగా తన ఆఫీసులో తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించటం.. టేబుల్ మీద ఉన్న బ్యాగుల్ని సందర్శకుల పైకి విసిరేయటం.. చెంప మీద కొట్టటంతో పాటు.. మహిళా భక్తురాలిపై కూడా చేయి చేసుకోవటం.. వాటికి సంబంధించిన వీడియో వైరల్ కావటంతో.. ఈ మతబోధకుడి వ్యవహారం మరోసారి చర్చకు వచ్చిందని చెప్పాలి.

Tags:    

Similar News