గ్రేటర్ యుద్ధం : మరికాసేపట్లో ముగియనున్న నామినేషన్ల పర్వం..రూల్స్ అతిక్రమిస్తే కఠిన శిక్షలు!
జీహెచ్ ఎంసి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ లో రాజకీయం వేడెక్కింది. అధికార టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు విమర్శలు , ఆరోపణలతో ముందుకుపోతూ గ్రేటర్ పీఠంపై తమ పార్టీ జెండా ఎగురవేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఏ నెల 17 న ఎన్నికల నోటిఫికేషన్ , షెడ్యూల్ విడుదల కాగా, ఇక నేటితో జిహెచ్ ఎం సి ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. ఎన్నికల కమిషన్ నామినేషన్లకు మూడు రోజులు గడువు ఇచ్చిన క్రమంలో 18వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈరోజు సాయంత్రం మూడు గంటలకి ముగియబోతుంది. ఇప్పటివరకు 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లను దాఖలు చేయగా పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉన్నాయి. అయితే సాయంత్రం 3 గంటల తర్వాత అభ్యర్థుల జాభితా పై ఓ క్లారిటీ వస్తుంది.
ఇకపోతే , కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లోని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం, పర్మిషన్ లేకుండా లౌడ్ స్పీకర్ ఉపయోగించకూడదని, రికార్డింగ్ చేసిన ఉపన్యాసాలను వాడాలని తెలిపింది. ఇక , బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించాలి అనుకుంటే అనుమతి తప్పనిసరి అని , అనుమతి ఉన్నా కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవాలని , ఆ తర్వాత చేస్తే చట్ట రీత్యా శిక్షార్హులు అవుతారని ,ఒక రోడ్డులో రెండు కన్నా ఎక్కువ పార్టీలు ర్యాలీలు తీయకూడదని తెలిపింది. ఒక పోలింగ్ కు , ఓట్ల లెక్కింపు కు 48 గంటల ముందు నుంచే లిక్కర్ అమ్మకాలను నిలిపి వేస్తామని , ఓటర్ స్లిప్ లపై ఓటర్ పేరు ఇతర వివరాలు మాత్రమే ఉండాలని, గోడల మీద ఎలాంటి రాతలు ఉండకూడదని, పోస్టర్లు అంటించడం నిషేధం అని ప్రకటించింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న పోస్టర్లు, బ్యానర్లను తొలగించిన ఈసీ ఎన్నికల నిబంధనలు పాటించకుంటే కొరడా ఝుళిపిస్తామని స్పష్టం చేసింది. ఇకపోతే ఎన్నికలకి ఎక్కువ సమయం లేకపోవడం తో పార్టీ కీలక నేతలందరూ ప్రచారంలో పాల్గొనడానికి షెడ్యూల్ రెడీ చేసుకుంటున్నారు.