టీఆర్ ఎస్ సర్కారులో మాటకారులకు కొదవ లేదు. కాకుంటే.. ఎమ్మెల్యే గా ఉంటూ.. పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేకున్నా.. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి అసెంబ్లీలో తాను చేసిన వాదనలతో అందరికి సుపరిచితుడిగా మారిన నేత గువ్వల బాలరాజు.
అధినేతను అసెంబ్లీలో ప్రశ్నించినట్లుగా ప్రశ్నిస్తూనే.. తన ప్రశ్నతో విపక్షాల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసేలా అధినేతకు అవకాశం ఇచ్చే బాలరాజు తెలివి ఎవరిని మాత్రం ఆకర్షించకుండా ఉంటుంది. అలాంటి బాలరాజు దూకుడుతనానికి పోయి.. అనవసరంగా వివాదంలో ఇరుక్కుపోయారన్న వాదన వినిపిస్తోంది. తాను పాల్గొన్న సభలో.. తనకు పింఛను రాలేదంటూ నిరసన తెలిపిన ఒక వికలాంగుడిపై చేయి చేసుకున్న వైనం ఇప్పుడు ఆయన్ను వివాదంలోకి నెట్టింది.
మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బాలరాజు ఎదుట ఒక వికలాంగుడు.. తనకు పింఛన్ రావటం లేదంటూ నిరసన వ్యక్తం చేశాడు. దీంతో.. కోపం వచ్చిన ఎమ్మెల్యే సదరు వికలాంగునిపై చేయి చేసుకున్నారు. ఊహించని పరిణామానికి సదరు వికలాంగుడు.. చుట్టూ ఉన్న వారు విస్మయానికి గురయ్యారు. ఎంత అధికారపక్షం నేత అయితే మాత్రం నిరసన వ్యక్తం చేసినందుకే అందరి ముందు అలా కొట్టేస్తారా? అన్న ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తేనే అంత అగ్రహమా బాలరాజు..?