చిన్నపాటి విమర్శను సైతం సహించలేకపోతున్న వైనం తెలంగాణ సర్కారులో కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంలోని ప్రముఖులు చిన్న విమర్శ పైనా చెలరేగిపోతున్నారు. కోట్ల రూపాయిలు ఖర్చు చేసి పనులు చేస్తున్నా.. విమర్శలు చేయటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఇలాంటి కోపం తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావుకు వచ్చింది.
ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో.. సామాన్యులకు అందుబాటులో ఉండేలా సబ్సిడీ మీద తెలంగాణ సర్కారు ఉల్లిపాయల్ని సరఫరా చేస్తున్న సగంతి తెలిసిందే. సబ్సిడీ ఉల్లి సరఫరా కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయటం.. సబ్సిడీ ఉల్లిపాయలు తీసుకునే వారి వేలికి ఇంకు చుక్క వేయటం లాంటివి చేస్తూ.. అక్రమాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే.. ఉల్లిపాయల సరఫరాలోని లోపాలు.. జనాలు బారులు తీరిన ఫోటోలను పత్రికల్లో రావటంపై మంత్రి హరీశ్ రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు తాజాగా ఉల్లి అగ్రహం కలిగింది. రూ.40కోట్లు ఖర్చు చేసి ఉల్లిపాయిల్ని సబ్సిడీలో తక్కువ ధరకు అందిస్తున్నా.. తెలంగాణలో ఉల్లిపాయాలు దొరకటం లేదని.. సబ్సిడీ ఉల్లిపాయాలు కావాలంటే గంటల కొద్దీ ఎదురుచూస్తున్నారంటూ కొన్ని పత్రికలు వార్తలు రాస్తూ.. ఫోటోలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొన్ని పత్రికలు పచ్చి అబద్ధాలు రాస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చూస్తుంటే.. రాసే ప్రతివార్త హరీశ్ రావు అండ్ కోలను పొగిడేయటం తప్పించి.. చిన్నపాటి విమర్శను కూడా భరించలేని స్థితికి తెలంగాణ సర్కారు చేరుకున్నట్లు కనిపిస్తోంది.
సబ్సిడీ మీద ఉల్లిపాయాలు తెలంగాణ సర్కారు సరఫరా చేయటం లేదని ఎవరూ అనటం లేదు. తెప్పిస్తున్న సరుకు.. ఏర్పాటు చేసిన కౌంటర్ల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు.. వార్తలు మీడియాలో వస్తున్నాయి. కానీ.. హరీశ్ రావుకు మాత్రం ఇలాంటి వార్తల్లో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. విమర్శను సహృదయంతో చూస్తే.. జరిగే తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అలాంటిది పోయి.. ప్రతిది తమకు అనుకూలంగానే ఉండాలనుకోవటం ప్రజాస్వామ్య భారతంలో కష్టమే కాదు.. అత్యాశ కూడా. మరి.. హరీశ్ లాంటి విషయాల్ని ఎందుకు మర్చిపోతున్నారో..?