ప్రభుత్వం - పోలీసులు ఏం చేస్తున్నారు..హైకోర్టు ఆగ్రహం!

Update: 2020-05-09 08:50 GMT
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేస్తుంది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలలో కరోనా ఇంకా కంట్రోల్ అవ్వడం లేదు. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే .. గత పది రోజులుగా నమోదు అవుతున్న కరోనా కేసుల్ని పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుంది అని చెప్పవచ్చు. తెలంగాణ లో కరోనా కేసులు తగ్గడానికి ప్రధాన కారణం ..రాష్ట్రంలో లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేయడమే అని చెప్పవచ్చు.

అయితే, లాక్ ‌డౌన్‌ సమయంలో కూరగాయలు, మాంసం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనిపై మొదట్లో ప్రభుత్వం స్పందించినా ఆ తరువాత కూరగాయల ధరలపై పెద్దగా దృష్టిపెట్టలేదు. దీనితో ఇదే అదునుగా భావించిన వ్యాపారస్తులు కూరగాయలు , నాన్ వెజ్ ధరలని విపరీతంగా పెంచేశారు. దీనితో కూరగాయల ధరలు పెరిగిపోయాయని ..హైకోర్టు లో ఫీల్ దాఖలైంది. ఆ  వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.

కూరగాయల ధరలపై క్షేత్ర స్థాయి నివేదికను న్యాయ సవాధికార సంస్థ హై కోర్టుకు సమర్పించింది. గుడ్లు, టమోటాలు మినహా నిత్యావసర ధరలన్నీ పెరిగి పోయాయని కోర్టుకు నివేదించింది. కూరగాయల ధరలు విపరీతంగా పెరగడం పై విచారణ వ్యక్తం చేసిన హైకోర్ట్లు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థలు ఏం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేసింది. ధరలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అడ్వకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ హైకోర్టుకు నివేదించారు. ధరల పెరుగుదలపై ఈ నెల 13వ తేదీలోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Tags:    

Similar News