ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు మనోధైర్యాన్ని ఇచ్చేవి ఏమైనా ఉన్నాయంటే అవి కచ్చితంగా సర్వేలనే చెప్పుకోవాలి. అయితే ఈ సర్వేలు ఫలితాలకు సంబందించిన ఉత్కంఠను కొన్నిసార్లు పెంచుతూపోతే.. మరికొన్నిసార్లు అభ్యర్థులను హెచ్చరిస్తుంటాయి. అనేక సందర్భాల్లో సర్వేలతో మేల్కొని ముందుకుపోయినవారు కూడా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో సర్వేలపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకూ ఇప్పుడు ఈ సర్వేల సంగతి ఏమిటంటారా? ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబందించి సర్వే ఫలితాలు వెలువడ్డాయి మరి!
అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలు అంటే.. ప్రపంచ వ్యాప్తంగా వాటిపై దృష్టి ఉంటుంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ ఎన్నికలపై ఉత్కంఠను రోజు రోజుకీ పెంచుతున్నాయి. ఈ ఎన్నికల్లో తన నోటిమాటలతో - సంచలన వ్యాఖ్యలతో ట్రంప్ ఇప్పటికే దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ కూడా పాయింట్ల పట్టికలో ముందున్న డొనాల్డ్ ట్రంప్ కు తాజాగా వెలువడిన సర్వే ఫలితాలు షాకిచ్చాయి. తాజాగా వెలువడిన ఈ సర్వే ఫలితాల ప్రకారం.. తొమ్మిది శాతం పాయింట్లతో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ముందుకు దూసుకెళ్లారు. డెమొక్రటిక్ పార్టీ జాతీయ సదస్సు నిర్వహించిన అనంతరం హిల్లరీ ఈ స్థాయిలో ముందుకెళ్లడం గమనార్హం.
అంతకుముందు 52శాతం పాయింట్లతో ముందున్న ట్రంప్ తొమ్మిది పాయింట్లు తగ్గిపోయి 43శాతం పాయింట్లతో కిందికి దిగిపోగా హిల్లరీ 58శాతం పాయింట్లతో ముందుకొచ్చింది. మహిళా లోకంతోపాటు శ్వేతజాతీయేతరులు - స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడా హిల్లరీకి లభించినట్లు సర్వే వెల్లడించింది. అంతేకాకుండా.. గతంలో హిల్లరీకి శాండర్స్ మద్దతుదారులు 78శాతం ఉండగా ఈ సదస్సు అనంతరం వారు 91శాతానికి పెరిగినట్లు కూడా సర్వే పేర్కొంది. దీంతో డెమొక్రటిక్ పార్టీలో సంబరాలు మొదలైనట్లయింది. సీఎన్ ఎన్/ఓఆర్సీ ఈ జాతీయ సర్వే ను నిర్వహించింది.