పిట్టల మాదిరి మనుషులు రాలిపోతున్న వేళలోనూ.. ఇమేజ్ కోసం.. క్రెడిట్ కోసం.. పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడే పరిస్థితి ఉంటుందా? అని కొందరికి సందేహం కలుగుతుంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా ఉండటానికి రాజకీయ నేతలు సాధువులు.. సన్యాసులు కాదు కదా? సంక్షోభంలోనే సరికొత్త ఇమేజ్ ను సొంతం చేసుకోవటానికి పడే పాట్లు అన్ని ఇన్ని కావు. ఏదైనా తప్పు జరిగిన వెంటనే.. దాని బాధ్యత నుంచి తప్పుకునే పాలకుల్నిచూస్తాం. వీలైతే దానికి కారణం తమ కంటే కూడా ఫలానా వాళ్లదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. చేతనైతే కేంద్రం నుంచి తీసుకురా అంటూ కేసీఆర్ ప్రభుత్వం లోని చాలామంది నేతలు.. బీజేపీకి సవాలు విసురుతుంటారు.
అదే సమయంలో.. తాము కోరినంతనే రాజకీయాలకు అతీతంగా స్పందించిన వేళలో మాత్రం ఆ విషయాన్ని హైలెట్ చేయకుండా ఉండే నేర్పు తెలంగాణ సర్కారు సొంతమన్న విమర్శ బీజేపీ నేతల నుంచి తరచూ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంతాన్నే వారు ప్రస్తావిస్తున్నారు. శుక్రవారం దేశంలో మరే రాష్ట్రంలో చోటు చేసుకోలేనట్లుగా.. యుద్ద విమానం (సీ-17) ఒకటి హైదరాబాద్ కు చేరుకుంది. అందులో మూడు ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లను తీసుకొని ఒడిశా వెళ్లింది. మొత్తం మూడు యుద్ధ విమానాల్లో మొత్తం తొమ్మిది ఆక్సిజన్ ట్యాంకర్లు ఒడిశాకు వెళ్లాయి.
భారీగా పెరిగిపోయిన కరోనా కేసులకు.. అవసరమైన ఆక్సిజన్ ఎక్కువ కావటం.. అందుకు తగ్గట్లుగా ఆక్సిజన్ నిల్వలు లేని నేపథ్యంలో దాన్ని అధిగమించేందుకు కేంద్రం వివిధ మార్గాల ద్వారా త్వరగా అందించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా రైల్లో ఆక్సిజన్ ట్యాంకర్లను తరలిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. తెలంగాణకు అవసరమైన ఆక్సిజన్ ట్యాంకర్లను ఒడిశా నుంచి రప్పించాలి. హైదరాబాద్ నుంచి దాదాపు 1250 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒడిశాకు రోడ్డు మార్గంలో పంపాలంటే కనీసం మూడు రోజులు పడుతుంది. అక్కడ ఫిల్ చేసి.. మళ్లీ తిరిగి వచ్చేసరికి వారం నుంచి తొమ్మిది రోజులు పడుతుంది. అదే జరిగితే ఆక్సిజన్ కొరత వెంటాడుతుంది.
ఈ సమస్యను అధిగమించేందుకు వాయు మార్గంలో.. మూడు యుద్ధ విమానాల్ని తమకు పంపాలని.. వాటిల్లో ఖాళీ ట్యాంకర్లను ఒడిశాకు పంపి.. ఫిల్ చేసిన తర్వాత రోడ్డు మార్గంలో రాష్ట్రానికి తెచ్చుకుంటామని.. దీని ద్వారా కనీసం మూడు..నాలుగురోజులు కలిసి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం కోరింది. వెంటనే స్పందించిన కేంద్రం.. దేశంలో మరే రాష్ట్రానికి లేని రీతిలో హైదరాబాద్ కు యుద్ధ విమానాల్ని పంపారు.
కట్ చేస్తే.. ఈ ఎపిసోడ్ లో ఆలోచన కేసీఆర్ సర్కారుదే అయినా.. వారు కోరిన వెంటనే స్పందించి రాష్ట్రానికి యుద్ధ విమానాలు పంపింది కేంద్రమే. అంటే.. ఇరువురు సమయానికి తగ్గట్లు స్పందించారనే చెప్పాలి. కానీ.. దేశంలో మరెక్కడా లేని రీతిలో తెలంగాణ ప్రభుత్వం స్పందించి.. ఆక్సిజన్ కొరత లేకుండా చేసేందుకు వినూత్నంగా వ్యవహరించినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. తమ భాగస్వామ్యాన్ని పెద్దగా ప్రస్తావించకుండా ఉండటాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సంక్షోభ సమయంలో స్పందించిన మోడీ సర్కారును మాట వరసకు థ్యాంక్స్ చెప్పలేదంటూ వారు మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. శుక్రవారం ఉదయం యుద్ధ విమానాల్లో వెళ్లిన ఆక్సిజన్ ట్యాంకర్లు.. శుక్రవారంరాత్రి ఫిల్ చేసుకొని రిటర్న్ అయ్యాయి. రవుర్కెలా నుంచి ఐదు.. అంగుల్ నుంచి నాలుగు ట్యాంకర్లు హైదరాబాద్ కు బయలుదేరాయి. తొమ్మిది ట్యాంకర్లలో ఎనిమిది ట్యాంకర్లలో ఒక్కొక్కదానిలో 14.5 టన్నుల చొప్పున.. ఒక దాన్లో మాత్రం 22 టన్నుల ఆక్సిజన్ ను నింపారు. ఇవి హైదరాబాద్ కు ఈ రోజు అర్థరాత్రికి కానీ.. ఆదివారం తెల్లవారుజాముకు చేరుకునే వీలుంది. అలా చేరుకున్నంతనే.. మరోసారి వాటిని రీఫిల్ చేసేసి.. ఖాళీ ట్యాంకర్లను మరోసారి ఒడిశాకు పంపుతారు. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేసే ఈ కార్యక్రమంలో.. మైలేజీ మాత్రం రాష్ట్రానికే పరిమితం కావటంపై కమలనాథులు కోపంతో ఉన్నారు.