తెలంగాణలో కేవలం స్టేట్ సెంటిమెంటునురాజేసి ఏర్పడిన టీఆర్ ఎస్.. ఇప్పుడు ఆ సెంటిమెంటును వదిలేసింది. జాతీయ పార్టీగా అవతరించింది. కేంద్రంలో మోడీకి చెక్ పెడతానంటూ.. పార్టీ అధినేత కేసీఆర్ టీఆర్ ఎస్‌ను కాస్తా.. బీఆర్ ఎస్‌గా మార్చారు. అయితే.. పార్టీ పేరు మారినంత మాత్రాన.. జాతీయ స్థాయిలో ఆయన చక్రం తిప్పాలంటే.. ఇతర రాష్ట్రాల సహకారం తప్పనిసరి!
మరి ఎవరు సహకరిస్తారు.. అంటే.. ఏదో ఒకరిద్దరు ఆయన వెంట నడిచేందుకు రెడీ అయ్యారు. అదే సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వం రావాలని కోరుకున్న కేసీఆర్..కు అదే జగన్ నుంచి ప్రత్యక్ష మద్దతు రాలేదు. కానీ, ఇప్పుడు అదే జగన్.. పరోక్షంగా ఆయనకు సహకరిస్తున్నారనే వాదన.. వినిపిస్తోంది. కేసీఆర్‌కు జగన్ కొన్ని కీలక సందేశాలు బహిరంగ వేదికలపైనే చేస్తున్నారని అంటున్నారు.
తాజాగా కడపలో ప్రసంగించిన జగన్.. తాను ఏపీకే పరిమితం అయి.. రాజకీయాలు చేస్తానని చెప్పారు. ఒకవైపు చంద్రబాబును తిడుతున్నట్టు కనిపించినా.. పరోక్షంగా కేసీఆర్‌కు సంకేతాలు ఇచ్చారని అంటున్నారు మేధావులు. అంటే.. తెలంగాణలో తాను అడుగు పెట్టబోనని.. అక్కడ కేసీఆర్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదని.. చెప్పుకొచ్చారు. అయితే.. బీఆర్ఎస్ ఏపీలోకి వస్తే.. ఏం చేస్తారనేది మాత్రం చెప్పలేదు.
ఇప్పుడు కేసీఆర్‌కు కావాల్సింది కూడా ఇదే. తనకుప్రత్యక్షంగా మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు. తనకు అడ్డు లేకుండా ఉంటే చాలు. ఇదే ఇప్పుడు జగన్ చేశారు. అంటే.. ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వకపోయినా.. పరోక్షంలో కేసీఆర్‌కు తాను అనుకూలమనే సంకేతాలు పంపించారు.తద్వారా.. కేసీఆర్ నాయకత్వాన్ని ఆయన ఒప్పుకొన్నట్టే అయిందని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.