అవును. భారత్ మొత్తం ఇదే అంటోంది. ఛీ..ఛీ.. పాకిస్థాన్ అంటే మాకు అసహ్యం అనేది. పాకిస్థాన్ ఈ పేరు వింటేనే చాలా మంది ఇండియన్స్‌కు ఒళ్లు మంట. తాజాగా జరిపిన ఓ సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైంది. 70 ఏళ్లుగా పక్కలో బళ్లెంలా ఉన్న పాక్ ను చూస్తే అసహ్యించుకోని భారతీయుడు ఉండడు. వాషింగ్టన్ కు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వేలో ఏకంగా 72 శాతం మందికి పాకిస్థాన్ పై మంచి అభిప్రాయం లేదని వెల్లడైంది. ఈ సర్వే మొత్తం 2464 మంది అభిప్రాయం తెలుసుకుంది. గత రెండు - మూడేళ్లతో పోలిస్తే పాకిస్థాన్ పై ఇండియన్స్ లో ప్రతికూల వైఖరి పెరిగిపోయినట్లు ఈ సర్వేతో స్పష్టమైంది.
2013లో 54 శాతం మంది - 2014లో 49 శాతం మంది పాకిస్థాన్ పట్ల వ్యతిరేక భావంతో ఉన్నారు. అదికాస్తా ఇప్పుడు 72 శాతానికి చేరడం గమనార్హం. అందులోనూ మిగతా దేశంతో పోలిస్తే.. ఉత్తర భారతంలో - పాక్ తో సరిహద్దు పంచుకునే రాష్ర్టాల్లో ఈ వ్యతిరేకత మరీ ఎక్కువగా ఉంది. పాక్ అంటే అసహ్యం అన్నవాళ్లలో కాంగ్రెస్ - బీజేపీ అనుచరులన్న తేడా కూడా పెద్దగా లేదు. బీజేపీ ఫాలోవర్స్ లో 70 శాతం మంది - కాంగ్రెస్ ఫాలోవర్స్ లో 63 శాతం మంది పాకిస్థాన్ అంటే వ్యతిరేక భావంతో ఉన్నారు. ఇక 88 శాతం మంది ప్రధాని నరేంద్ర మోడీ పట్ల సానుకూలంగా ఉండటం విశేషం. అయితే పాకిస్థాన్ తో ఆయన వ్యవహరిస్తున్న తీరును మాత్రం కేవలం 21 శాతం మంది మాత్రమే సమర్థించారు. కశ్మీర్ అంశంపైనా ఈ సర్వేలో ప్రశ్నలు అడిగారు. 62 శాతం మంది కశ్మీర్ అంశం చాలా తీవ్రమైన సమస్య అని చెప్పారు. 63 శాతం మంది కశ్మీర్ లో మిలిటరీ చర్యలను మరింత బలంగా అమలు చేయాలని అభిప్రాయపడ్డారు.