ఎన్నారైలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన హైదరాబాద్ సీపీ

Update: 2022-01-05 06:38 GMT
దేశం కాని దేశంలో ఉండి.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వార్తలు.. విశేషాలు తెలుసుకుంటూ.. తమ వాదనల్ని.. తమ స్పందనలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునే ఎన్నారైలు గడిచిన కొంతకాలంగా ఎక్కువ అవుతున్నారు. ఇదేం తప్పు కూడా కాదు. కానీ.. దేశం కాని దేశంలో ఉండి.. తమకు నచ్చింది.. తోచింది.. ఇష్టం వచ్చినట్లుగా చేస్తే.. ఏం జరగదన్న ధీమా ఈ మధ్యన కొందరు ఎన్ఆర్ఐలలో ఎక్కువ అవుతోంది. ఇలాంటి వారికి దిమ్మ తిరిగేలా షాకిచ్చారు హైదరాబాద్ కమిషనరేట్ కు సీపీగా ఇటీవల ఛార్జ్ తీసుకున్నసీవీ ఆనంద్. విదేశాల్లో ఉంటూ ప్రధాని మొదలు.. ఎవరి మీదనైనా సరే ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం.. ద్వేషపూరిత పోస్టులు పెట్టటం.. విద్వేషాన్ని రగిలించేలా వ్యాఖ్యలు చేయటం లాంటివి చేస్తున్న ప్రవాసీయుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్న విషయాన్ని తాజాగా సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

ఇలాంటి ప్రవాసీయులకు సంబంధించిన పాస్ పోర్టుల్నిరద్దు చేయాలన్న సిఫార్సును చేస్తామని.. ఒకవేళ ప్రవాస భారతీయులకు విదేశీ పౌరసత్వం ఉంటే.. వారిపై నమోదు చేసిన కేసుల వివరాల్ని ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు పంపనున్నట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి వారి వీసా రద్దుకు కూడా తాము సిఫార్సు చేస్తామని చెప్పటం ద్వారా.. అల్లంత దూరాన.. విదేశాల్లో ఉన్న వారు ఏం చేసినా సరిపోతుందన్నట్లుగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవన్న విషయాన్ిన ఆయన స్పష్టం చేశారు.

తాజాగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన అధికారులతో నిర్వహించిన రివ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియాలో ప్రధాని.. ముఖ్యమంత్రి.. రాష్ట్ర మంత్రులకు సంబంధించిన విద్వేష పోస్టులు పెద్ద ఎత్తున పెడుతున్నారని.. వీటికి సంబంధించిన కంప్లైంట్లను పరిశీలించగా.. కొందరు ఐపీ అడ్రెస్ లు దుబాయ్.. అమెరికాలో ఉన్నట్లుగా తేలటంతో.. ఎన్ఆర్ఐలు పెట్టే సోషల్ పోస్టుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని సీవీ ఆనంద్ డిసైడ్ చేశారు. సో.. ఎన్ఆర్ఐలు జర జాగ్రత్తగా ఉండండి. తొందరపడి విద్వేష పోస్టులు పెట్టే వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు వేయాల్సిందే. లేకుంటే.. సమస్యల సుడిగుండంలో కాలు మోపినట్లు అవుతుంది.


Tags:    

Similar News