ఒకనాటి నటి.. రాజకీయాల్లోకి వచ్చి పోతుండే విజయశాంతి తాజాగా ఒక క్లారిఫికేషన్ ఇచ్చేశారు. ఈ మధ్యన మీడియాలో బాగా నానిన ఆమె.. తన రాజకీయ ప్రయాణంపై ఒక స్పష్టతను ఇచ్చారు. అమ్మ ఆకస్మిక మరణం నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల వైపు రాములమ్మ అడుగులు వేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి.
తమిళనాడు అధికారపక్షమైన అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరించటం.. చిన్నమ్మ వర్గానికి తన మద్దతును బాహాటంగా ప్రకటించటం.. ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా.. వేళ కాని వేళలో చిన్నమ్మతో విజయశాంతి భేటీ కొత్త అంశాల్ని తెర మీదకు తెచ్చింది.
అన్నాడీఎంకేలో చేరటానికి విజయశాంతి రంగం సిద్ధం చేసుకుంటున్నారని.. చిన్నమ్మ వర్గాన్ని హ్యాండిల్ చేసేందుకు చిన్నమ్మ ఓకే చెప్పారని.. అందులో భాగంగానే విజయశాంతి ఆమెతో భేటీ అయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే... జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది విజయశాంతి. తన రాజకీయ జీవితమంతా తెలంగాణలోనేనని.. తాను తమిళనాడుకు వెళ్లిపోతానన్న వార్తల్లో నిజం లేదని.. అవన్నీ అవాస్తవాలని మాజీ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు.
అనారోగ్య కారణాల వల్లే తాను కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నానే తప్పించి.. మరే కారణం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న విజయశాంతి.. అమ్మతో తనకున్న అనుబంధం ఎంతో ఎక్కువన్నారు. అమ్మకు తానంటే ఎంతో అభిమానమని.. అదే సమయంలో అమ్మ అంటే తనకూ అపరిమితమైన గౌరవం ఉన్నట్లుగా వెల్లడించారు రాములమ్మ.
అమ్మతో ఉన్న అనుబంధంతోనే సంక్షోభంలో ఉన్న వేళ.. అన్నాడీఎంకేకు మద్దతు పలికినట్లుగా చెప్పారు. పేద ప్రజలతో మమేకమై.. మంచి పథకాలు ప్రవేశ పెట్టిన జయలలిత ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధికారాన్ని చేపట్టారని.. అలాంటి ప్రభుత్వాన్ని కూలదోయటానికి జరుగుతున్న ప్రయత్నాల్ని నిలువరించేందుకే అన్నాడీఎంకేకు తన మద్దతును ప్రకటించినట్లుగా చెప్పుకున్నారు. తమిళనాడు రాజకీయాలంటే ఇంట్రస్ట్ లేదన్న విజయశాంతి.. రూల్స్ ను బ్రేక్ చేసి మరీ.. వేళ కాని వేళలో జైల్లో ఉన్న చిన్నమ్మతో ఎందుకు భేటీ అయినట్లు? అన్న విషయం మీదా క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/