మ్యాచ్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఈ నేరానికి పాల్పడిన ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. యూఏఈకి చెందిన మొహ్మద్ నవీద్, షైమన్ అనర్వ్ లపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసీసీ వెల్లడించింది.
2019లో యూఏఈలో జరిగిన ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ లో వారు ఫిక్సింగ్స్ కు పాల్పడినట్టు నిర్ధారణ జరిగిందని ఐసీసీ ప్రకటించింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాతే వారిపై నిషేధం విధించినట్టు తెలిపింది. 8 సంవత్సరాలపాటు వారిపై నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది.
అయితే.. ఈ శిక్ష అమలు విషయంలో వారికి ఊరట కల్పించింది ఐసీసీ. ఈ నిషేధ కాలాన్ని 2019 మార్చి 16 నంచి లెక్కించనున్నట్టు ప్రకటించింది. కాగా.. గతంలోనూ పలువురు క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కారణంగా తమ కెరీర్ ను కోల్పోయారు.