కోహ్లీ కూడా ఇలా చేస్తాడనుకోలేదు..

Update: 2019-04-28 09:24 GMT
విరాట్ కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో మనం క్రికెట్ పోటీల్లో చూస్తుంటాం.. కోహ్లీ దూకుడును ఎంజాయ్ చేస్తాం.. అతడు కసితో సెంచరీలు బాదేస్తుంటే ఆనందిస్తాం.. ఇలా ఉండాలిరా క్రికెటర్ అంటూ మెచ్చుకుంటాం. నిర్లక్ష్యంగా ఉండడం.. పొరపాట్లు చేయడాన్ని ఇష్టపడని కోహ్లీ తొలిసారి నిర్లక్ష్యంగా వ్యవహరించి విమర్శల పాలయ్యాడు..

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అందరు క్రికెటర్లు - సినీ - రాజకీయ సెలబ్రెటీలందరూ ఓటుహక్కును నమోదు చేసుకొని ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తూ మీడియాకు ఓటేసిన వేలును చూపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వయంగా ప్రధాని మోడీ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని దేశంలో ఓటింగ్ శాతం పెంచేలా.. ఓటు వేసేలా అవగాహన కల్పించాలని ట్విట్టర్ లో ట్యాగ్ చేసి కోరాడు.

కానీ కోహ్లీ మాత్రం నిర్లక్ష్యంతో తన ఓటునే వేయకుండాపోయాడు. విరాట్ కోహ్లీ ముంబైలో తన ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా దాన్ని అధికారులు పెండింగ్ లో పెట్టడం విశేషం. ఇంతకీ ఎందుకు పెండింగ్ లో పెట్టారని ఆరాతీస్తే అసలు విషయం తెలిసింది.

విరాట్ కోహ్లీ ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటానంటే మార్చి 30వరకు అధికారులు గడువు ఇచ్చారు. విరాట్ ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. అక్కడ నాలుగోవిడతలో పోలింగ్ జరుగుతుంది. అయితే కోహ్లీ మాత్రం నిర్లక్ష్యంగా మార్చి 30 ముగిశాక ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఎన్నికల అధికారులు కోహ్లీకి ఓటు హక్కు కల్పించకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నమోదు చేస్తామని తెలిపారు. ఇలా కోహ్లీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కునే వేయకుండా పోయారు. 

కోహ్లీ ఓటు హక్కును కోల్పోవడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అందరికీ సూక్తులు చెప్పే కోహ్లీ ఓటు హక్కు నమోదు విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడా అని మండిపడుతున్నారు.
Tags:    

Similar News