2024 నాటికి కొత్తగా 100 ఎయిర్ పోర్టులు

Update: 2020-02-01 10:38 GMT
కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సారి వ్యవసాయం, విద్యా రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రకటించారు. అత్యధికంగా జల్ జీవన్ కు రూ.3.06 లక్షల కోట్లు, వ్యవసాయానికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయించారు. విద్యారంగానికి సైతం 99300 కోట్లు కేటాయించడం విశేషం.

దేశంలో రవాణా రంగం రోజురోజుకు పెరుగుతోంది. జనాలు కాలంతో పోటీపడుతున్నారు. అందుకే ఎక్కువగా విమానాల ద్వారానే ప్రయాణాలు సాగించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రైళ్లు, బస్సుల కంటే విమానాల్లోనే ప్రయాణిస్తూ తమ టైంను సేవ్ చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో దేశ రవాణా వ్యవస్థను మరింత బలపరచాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ప్రకటించారు.

2024 నాటికి దేశంలో కొత్తగా 100 ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఉడాన్ పథకం ద్వారా సామాన్యుడికి కూడా విమానాయనం చేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇక దేశ రవాణా వ్యవస్థకు కీలకమైన హైవే రహదారులను వేగంగా అభివృద్ధి చేస్తామని.. పోర్టులను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. పెరుగుతున్న ప్రజల అవసరాల కోసం రవాణా రంగానికి ప్రాధాన్యమిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు.
Tags:    

Similar News