‘‘జాతీయ చిహ్నం’’ కంట కన్నీరు..?

Update: 2016-12-26 08:19 GMT
కొంతమంది ఎంతో చేసినా వారికి రావాల్సిన కీర్తి ప్రతిష్టలు పెద్దగా రావు. కానీ.. మరికొందరి విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. తాజా ఉదంతం చూస్తే.. ఇది నిజమనిపించక మానదు. చిన్న చిన్న సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు తాటి కాయంత హెడ్డింగ్స్ తో హడావుడిగా చేసే మీడియా సంస్థలు.. కొన్ని కీలకమైన అంశాల విషయంలో పెద్దగా పట్టించుకోని తీరు కనిపిస్తుంది. అదేమంటే.. వారికంత ఇమేజ్ లేదనో.. ఫాలోయింగ్ లేనట్లుగా చెబుతారు.

తాజాగా అలాంటి ఒక ఉదంతం చోటు చేసుకుంది. రాజ్యాంగ రాతప్రతిని అందంగా తీర్చిదిద్దిన బృందం ఒకటి ఉంది. దానిలో పని చేసిన భార్గవ అనే 89ఏళ్ల పెద్దాయన రెండురోజుల క్రితం మరణించారు. ఆయన గొప్పతనం ఏమిటంటే.. జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని గీసిన కళాకారుల బృందంలో ఆయన కూడా సభ్యుడు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉండే ఆయన కొన్నేళ్లుగా గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. తాజాగా ఆయన కన్నుమూశారు. జాతీయ చిహ్నాన్ని రూపొందించిన వ్యక్తుల బృందానికి చెందిన ముఖ్యుడు మరణించినా.. పట్టించుకోని మన మీడియాను చూస్తే.. బాధ వేయక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News