అమెరికాలో ప్రారంభమయన విద్వేష దాడులు మెల్లిమొల్లిగా ఇతర దేశాలకు వ్యాపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పోలాండ్ లోని పోజ్‌నాన్ నగరంలో ఓ భారతీయుడ్ని అమానుషంగా కొట్టి చంపినట్టుగా కథనాలు వెలువడ్డాయి. ఆ విద్వేష దాడిలో అతడు మరణించాడా లేక తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడా అన్నది స్పష్టం కావడం లేదు. దీనిపై తీవ్రంగా స్పందించిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తక్షణమే నివేదిక అందించాలని పోలాండ్ లోని భారత రాయబారి అజయ్ బిసారియాను ఆదేశించారు.
అమెరికాలోని కాన్సాస్ లో జరిగినట్టుగానే పోలాండ్ లో ఈ భారతీయ విద్యార్థిపై దాడి జరిగిందని అమిత్ అగ్నిహోత్రి అనే మరో భారతీయుడు అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. భారతీయ విద్యార్థిని కొట్టి చంపినట్టుగా అగ్నిహోత్రి తెలిపారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి జరిపిన దాడిలో భారతీయ విద్యార్థి తల - చేతులు - ముఖానికి తీవ్రంగా గాయాలయ్యాయని, అతడ్ని ఆందోళనకర స్థితిలో ఐసియులో చేర్చినట్టుగా మరో కధనం వెలువడింది. అయితే పూర్తి అధికారిక సమాచారం వెలువడకపోవడం కలకలం రేకెత్తిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ వివరాలు తెలియవచ్చునని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/