విశాల్ జీతం రూ.75 కోట్లు

Update: 2016-02-25 10:02 GMT
ఎవరీ విశాల్.. ఏమా కథ అంటారా? ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కు సీఈవో. పూర్తి పేరు విశాల్ సిక్కా. ఈయన వార్షిక వేతనం రూ.75 కోట్లని తేలింది. భారత ఐటీ రంగంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారి సరసన విశాల్ సిక్కా నిలిచాడు. ఏడాదికి 11 మిలియన్ డాలర్లు.. అంటే మన రూపాయల్లో సుమారు రూ. 75 కోట్లు అందుకుంటున్నాడు సిక్కా. ఐటీ కంపెనీలు ఆదాయాన్ని బట్టి పెద్ద తలకాయలకు జీతాలిస్తాయన్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో ఇన్ఫోసిస్ దూసుకుపోతోంది. దీంతో మొదట్లో సుమారు రూ. 54 కోట్లుగా ఉన్న సిక్కా జీతం ఇటీవల బాగా పెరిగి రూ.75 కోట్లకు చేరుకుంది..

సిక్కాకు సంవత్సరానికి 11 మిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇస్తుంటే.. అందులో బేసిక్ శాలరీ ఒక మిలియన్ డాలర్. వేరియబుల్ పే 3 మిలియన్ డాలర్లు. మిగతా మొత్తం స్టాక్ ఆప్షన్లు. ఇలా మొత్తంగా 11 మిలియన్ డాలర్లు అందుకుంటున్నాడు సిక్కా. ఐతే భారత ఐటీ రంగంలో విశాల్ కంటే ఎక్కువ వార్షిక వేతనం అందుకుంటున్న సీఈవోలు లేకపోలేదు. కాగ్నిజెంట్  సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా 2014-15 సంవత్సరానికి 11.3 మిలియన్ డాలర్ల జీతం అందుకోవడం విశేషం. మరికొందరు ఐటీ కంపెనీల సీఈవోలు కూడా భారీగా వేతనం అందుకుంటున్నారు. ప్రస్తుతం ఐటీ రంగం రైజింగ్ లో ఉండటంతో వీళ్ల జీతాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News