పక్షం రోజులుగా ఉభయగోదావరి జిల్లాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న సైకో సూదిగాడి విషయంలో పోలీసులు కొత్త అంకానికి తెరలేపారు. తనిఖీళ్లో భాగంగా ఇప్పటికే పలువురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు ఎట్టకేలకు సీసీ ఫుటేజీ ఆధారంగా అతడి ఫొటోను మాత్రం పట్టుకున్నారు. దాడులు జరుగుతున్న ఏరియాలో జిల్లా ఎస్పీతో సహా మకాం వేసినా పోలీసులు సూదిగాడిని పట్టుకోలేకపోవడంతో జిల్లా ప్రజలతో పాటు పోలీసుల ఉన్నతాధికారుల నుంచి వారికి అక్షింతలు గట్టిగానే పడ్డాయట.
దీంతో పోలీసులు లాజర్ యువకుడిని అదుపులోకి తీసుకుని సైకో సూదిగాడిగా ఒప్పుకోవాలని అతడిని తీవ్ర వేధింపులకు గురి చేశారట. నరసాపురం డీఎస్పీ సౌమ్యలత తానే సైకో సూదిగాడు అని ఒప్పుకోవాలని వేధించినట్టు లాజర్ అనే యువకుడు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నాడు. లాజర్ ప్రకటనపై డీఎస్పీ సౌమ్యలత మాట్లాడుతూ సైకో సూదిగాడి కోసం గాలిస్తుండగా పోడూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకే లాజర్‌ను అదుపులోకి తీసుకున్నామని...అతడికి సైకో దాడులతో సంబంధం లేదని నిర్దారించుకున్నాక లాజర్‌ను వదిలేసినట్టు ఆమె చెపుతున్నారు.
తాము లాజర్‌ను వేధిస్తున్నట్టు అతడు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆమె చెప్పారు. సైకో సూదిగాడి కోసం గాలిస్తున్న క్రమంలో తాము ఎంతో మందిని అదుపులోకి తీసుకున్నామని..వాళ్లెవ్వరు చేయని ఆరోపణలు లాజర్ ఎందుకు చేస్తున్నాడో తమకు అర్థం కావడం లేదని సౌమ్యలత చెప్పారు.
ఇదిలా ఉంటే శనివారం నల్గొండ జిల్లాలో మూడోసారి సూదిగాడి కలకలం రేగింది. ఇప్పటికే కోదాడ, హుజూర్ నగర్ ప్రాంతాల్లో ఈ తరహా దాడులు జరగగా..తాజాగా ఈ రోజు మేళ్లచెర్వు మండలం రామాపురంలో ఓ వ్యక్తిపై ఇదే తరహా దాడి జరిగింది. బైక్ పై వెళుతున్న నరసింహారావు అనే వ్యక్తికి మరో బైక్ పై హెల్మెట్ పెట్టుకుని వచ్చిన ఇద్దరు దండుగులు సూది గుచ్చి పరారైనట్టు బాధితుడు చెపుతున్నాడు. సైకో సూదిగాడి కోసం అటు ఏపీ పోలీసులతో పాటు ఇటు తెలంగాణలో నల్గొండ జిల్లా పోలీసులు కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.