గత మూడేళ్ల వ్యవధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో ఆరు మందికి ఆ పార్టీ టికెట్ దక్కే అవకాశాలు లేవని సమాచారం. అప్పుడంటే అవసరం మేరకు చంద్రబాబు నాయుడు వారిని పార్టీలో చేర్చుకున్నారని.. ఇప్పుడు మాత్రం సర్వేలు - అధ్యయనాలు.. నెగిటివ్ ఫలితాలు వచ్చాయని అంటూ..వారికి టికెట్లను నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారనేది చంద్రబాబు నాయుడి సర్వేల సారాంశం. వారిలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ముందున్నారని తెలుస్తోంది. దీంతో వీరికి టికెట్ దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది.
వీరిని పార్టీలోకి చేర్చుకునేటప్పుడేమో.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఖాయమని భరోసా ఇచ్చారట. అయితే.. ఇప్పుడు మాత్రం నో అని అంటున్నారట. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలది దిక్కుతోచని స్థితే అవుతోంది.
ఇక ఇదే సమయంలో వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. తాము తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని వారు అంటున్నారట. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు వారు వర్తమానాలు పంపుతున్నారని సమాచారం.
అయితే.. వారిని తిరిగి చేర్చుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి అంత ఆసక్తితో లేరని సమాచారం. వారు ఫిరాయించినప్పుడే వారిపై జగన్ దాదాపుగా నమ్మకం పోయింది. ఇప్పుడు వాళ్లు వచ్చినా వారితో గతంలోలా ఉండటం కుదరదు అనేది జగన్ భావన. అందులోనూ తెలుగుదేశంలో టికెట్ దక్కే పరిస్థితి లేదని తెలిసి.. వారు ఇటు వస్తున్నారనే అంశంపై జగన్ కు స్పష్టత వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో.. వారిని తన వైపుకు రానీయకూడదని జగన్ నిర్ణయించారట. దీంతో.. ఫిరాయింపుదారుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా పడిందని సమాచారం.