వైఎస్ ఆర్ బాటలో జగన్.. మరో భారీ పథకం

Update: 2019-12-21 13:21 GMT
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు ఎంత ఫేమస్ అయ్యాయో మనం చూశాం. ఇప్పుడు ఆయన వారసుడు ఏపీ సీఎం జగన్ సైతం మరో భారీ పథకానికి శ్రీకారం చుడుతున్నారు.  ఇందిరమ్మ ఇళ్ల వలే పేదలకు బహుళ అంతస్థుల ఇంటి నిర్మాణాలు చేయించి ఇవ్వాలని యోచిస్తున్నారు.

ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ కంటే బహుళ అంతస్థుల భవనాలు నిర్మించి ఇవ్వడం మేలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.

మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం ముంబైలో జీ+10 విధానంలో బహుళ అంతస్థులను నిర్మించి పేదలకు ఇస్తోంది. ఇదే విధానంలో రాష్ట్రంలో కూడా జీ+10 వరకు బహుళ అంతస్థులు నిర్మించి పేదలకు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు తెలిసింది. కోట్లు పలుకుతున్న భూ డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని ఈ విధానం అయితేనే మేలు అని నిర్ణయానికి వచ్చింది.ఎకరంలో జీ+10 కడితే 300 మందికి ఇవ్వొచ్చని అధికారులు భావిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన ఈ పథకంలో ఇళ్ల స్థలాల పంపిణీకి స్థలాల కొరత తీవ్రంగా ఉందని తేలింది. కోట్లు విలువ చేసే భూములు కొనేకంటే ఒక ఎకరం కొని 300 మందికి ఇళ్లు కట్టించి ఇవ్వడం మేలని సర్కారు భావిస్తోంది.
Tags:    

Similar News