ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ కి గత కొన్ని నెలలుగా ఇండైరెక్ట్ వార్ నడుస్తోంది. ఆ మధ్య ఉద్యోగ సంఘాల నేతలు జిల్లాలలో నిరసన కూడా చేపట్టారు. ఇక జగన్ ప్రభుత్వంతో తాడో పేడో అని కూడా వారు ఒక దశలో గట్టిగా డిసైడ్ అయ్యారు. ఈ నేపధ్యంలో ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసరావు అంతర్గత సమావేశంలో అన్నట్లుగా వినవచ్చిన మాటలు ఏపీలో రాజకీయ అలజడినే రేపాయి.
మేము ప్రభుత్వ ఉద్యోగులం అక్షరాలా 13 లక్షలు, మాతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ని లెక్కేసుకుంటే అరవై లక్షలు. మేము కనుక తలచుకుంటే ప్రభుత్వాలను కూల్చగలం అంటూ ఆయన ఇండైరెక్ట్ గా వైసీపీ సర్కార్ కి వార్నింగ్ ఇచ్చిన్నట్లుగా అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీని మీద ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాల్లో పెద్ద డిబేట్లే సాగాయి.
అయితే ఆ తరువాత ఆయన జగన్ని మరో సందర్భంలో పొగిడారు కూడా. జగన్ తమ కష్టాలను అర్ధం చేసుకుని పరిష్కరించే సీఎం అని కూడా కితాబు ఇచ్చారు. ఇదిలా ఉంటే సహజంగానే ప్రభుత్వానికి ఇలాంటి లీడర్లు టార్గెట్ అవుతారు అన్న సహజనమైన మాట ఉంటుంది. జగన్ సర్కార్ కూడా బండిని టార్గెట్ చేస్తుందా అన్న చర్చా సాగింది.
ముఖ్యమంత్రి జగనే బండిని నేరుగా టార్గెట్ చేశారు. అలా ఇలా కాదు ఆయనకే గట్టి షాక్ తగిలేలా అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆర్ధికపరమైన డిమాండ్లను తీర్చమని జగన్ని కోరుకుంటే ఆయన ఏకంగా అడగని మరో వరాన్ని ఇచ్చేశారు. అదే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్ళకు పెంచడం.
దీంతో అన్ని రకాల ప్రభుత్వ సౌకర్యాలతో మరో రెండేళ్ల పాటు సర్కార్ ఉద్యోగులు హ్యాపీగా ఉండవచ్చు అన్న మాట. ఈ దెబ్బతో ఉద్యోగులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అందరి కంటే కూడా ఎక్కువగా హ్యాపీ అవుతున్నది బండి శ్రీనివాసరావే అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన వచ్చే నెలలో రిటైర్ కాబోతున్నారు.
ఇపుడు జగన్ పెంచిన పదవీ విరమణ వయసు పెంపు ఆయనకే ఫస్ట్ ఉపయోగపడబోతోంది. దాంతో బండి ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారని టాక్. అలా బండికి భారీ షాక్ ఇచ్చేశారు జగన్. మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో జగన్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం మాత్రం వారికి సంక్రాంతికి ముందే తెచ్చింది అంటున్నారు. చూడాలి మరి మిగిలిన వాటి మీద వారి రియాక్షన్ ఎలా ఉంటుందో.