పవన్ పొత్తు లెక్కను అసెంబ్లీ సాక్షిగా జగన్ తీస్తారా?

Update: 2020-01-17 04:45 GMT
రాజకీయాల్లో ఏమున్నా లేకున్నా స్థిరత్వం చాలా ముఖ్యం. స్నేహితులుగా పొత్తు కానీ.. వారితో కటీఫ్ కానీ చాలా సింఫుల్ గా చేయొచ్చన్నట్లుగా ఉంటుంది జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు చూసినప్పుడు. పార్టీ పెట్టినంతనే బీజేపీకి తనకు తానుగా దగ్గరైన ఆయన.. తర్వాతి కాలంలో కమలనాథులపై కస్సుమంటూ కటీఫ్ చెప్పేసింది ఆయనే. ప్రత్యేక హోదాను ఏపీకి ఇప్పించుకునే విషయంలో ఫెయిల్ అయిన పవన్.. బీజేపీతో రాంరాం అంటూ వేరైపోయారు. ఈ సందర్భంగా మోడీ అండ్ కో మీద కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీకి వెళ్లి రెండు.. మూడు రోజులు ఉండి మరీ బీజేపీ పెద్దలతో సమాలోచనలు జరిపారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి బెజవాడకు వచ్చిన పవన్.. ఏపీ బీజేపీ నేతలతో చర్చలు జరిపి.. ఉమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టటం తెలిసిందే.

అయితే ఫ్రెండ్ షిప్.. లేదంటే కటీఫ్ అన్నట్లు వ్యవహరించే పవన్ తీరుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ రియాక్ట్ అవుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతి విషయంలోనూ ఏదోలా జగన్ మీద సటైర్లు పేల్చటం.. తీవ్ర వ్యాఖ్యలు చేయటం ఈ మధ్యన అలవాటుగా మారిన పవన్ కు భారీ కౌంటర్ ఉందంటున్నారు. ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు సాగే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పవన్ పై భారీ పంచ్ పడటం ఖాయమంటున్నారు.

ఇష్టారాజ్యంగా మాట్లాడటం.. తనను ఉద్దేశించి పవన్ చేసే విమర్శలకు సమాధానం చెప్పటంతో పాటు..తాజా పొత్తుపై ఘాటు రియాక్షన్ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. రాజధాని తరలింపు.. మూడు రాజధానులపై క్లారిటీ ఇచ్చే సందర్భంలో జనసేనాధినేతకు సీఎం జగన్ పంచ్ వేయటం పక్కానని చెబుతున్నారు.


Tags:    

Similar News