ఉద్యోగం కోసం బయోడేటా సిద్ధం చేసి పంపటాన్ని అంతో ఇంతో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ పదవుల కోసం అధి నాయకత్వాన్ని అప్లికేషన్లు పెట్టుకోవటానికి మించిన దరిద్రం ఇంకొకటి ఉండదు. ప్రజల్లో మమేకమై.. వారి వెంట నడుస్తూ.. వారి ఆదరాభిమానాలు పొందాలే కానీ పదవులు వెతుక్కుంటూ వచ్చేస్తాయి. కానీ.. ఇందుకు భిన్నమైన రాజకీయం ఇప్పుడు నడుస్తోంది. తాము ఎంత తోపులమన్న విషయాన్ని పార్టీ అధి నాయకత్వానికి పంపుతూ.. వారిని ప్రసన్నం చేసుకునేందుకు కదిపే పావులు అన్నిఇన్ని కావు.
తాజాగా అలాంటి ఉదంతాన్ని ఓపెన్ గా చెప్పేశారు జగ్గారెడ్డి. దీర్ఘకాలం గా పాలిటిక్స్ లో సాగుతున్న ఆయన కన్ను తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి మీద పడింది. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతి లో ఉన్న ఈ పదవీ కాలం త్వరలో ముగుస్తున్న వేళ.. కొత్త చీఫ్ ను పార్టీ ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు లోగుట్టు గా ఢిల్లీ స్థాయి లో ఈ పదవి ని చేపట్టేందుకు వీలుగా లాబీయింగ్ షురూ చేశారు.
ఇలాంటి వేళ.. తాను కూడా పీసీసీ చీఫ్ పదవి రేసు లో ఉన్నట్లు వెల్లడించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అధిష్ఠానాని కి తన బయోడేటా ను పంపినట్లు చెప్పారు. ఉత్తమ్ తర్వాత తనకే ఆ పదవిని కట్ట బెట్టాలని ఆయన కోరుతున్నారు. తన బయోడేటాన పార్టీ అధినేత్రి సోనియా తో పాటు.. రాహుల్ గాంధీ.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు పలువురికి పంపినట్లు చెప్పారు. అయినా.. పార్టీ పదవి రావాలంటే ప్రజల్లో ఇమేజ్ ఉండాలే తప్పించి.. అదే పనిగా బయోడేటాలు పంపితే ప్రయోజనం ఉంటుందంటావా జగ్గా?