తమిళనాడు సీఎం జయలలిత మరోమారు తన రాజకీయ పరిణతిని ప్రదర్శించారు. వ్యూహాలు వేయడంలో దిట్ట అయిన అమ్మ తాజాగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రజా సంక్షేమం కోణంలో డిమాండ్ చేశారు. ఇటీవలే జల్లికట్టుకు అనుమతి పేరుతో కేంద్రాన్ని డైలమాలో పడేసేందుకు చూడగా..కేంద్రం ఆ క్రీడకు అనుమతి ఇచ్చి ఊపిరి పీల్చుకుంది. కాగా జయలలిత ఇపుడు వరద సాయం పేరుతో ఇరుకున పడేసే ప్రయత్నం చేశారు.
ఈశాన్య రుతు పవనాల వల్ల కురిసిన భారీ వర్షాల నష్టాన్ని తమిళనాడు సీఎం జయలలిత ప్రకటించారు. అక్టోబర్-డిసెంబర్ మధ్య నాలుగు దశల్లో కురిసిన భారీ వర్షాల వల్ల తమ రాష్ట్రంలో 470 మంది మృతి చెందారని తెలిపారు. లక్ష పశువులు మృతి చెందగా.. 3,82,768 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వివరించారు. పునరావాస కార్యక్రమాల కోసం రూ.25,912 కోట్ల సాయమందించాల్సిందిగా జయలలిత కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల వల్ల ప్రాణాలు కోల్పోయిన 245మంది కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున సాయమందించినట్టు జయలలిత తెలిపారు. రానున్న రోజుల్లో మిగతా కుటుంబాలకు సాయమందిస్తామన్నారు.
తమిళనాడులో వరదల సమయంలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ మెరుగైన సహాయం అందిస్తామని, కేంద్ర బృందాలను రాష్ర్టానికి పంపిస్తామని చెప్పారు. మూడు దశల్లో కురిసిన వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని ఇప్పటికే ఆ రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం అంచనా వేసింది. ఇవాళ్టి నుంచి మరోసారి కేంద్ర బృందం అక్కడ పర్యటించనుంది. త్వరలో ఎన్నికలుండటం, మోడీ హామీ ఇచ్చిన నేపథ్యంలో తమిళనాడులో బాధితులను ఆదుకోవడానికి అంటూ కేంద్రాన్ని, మోడీని ఇరుకున పెట్టే మొత్తాన్ని జయలలిత డిమాండ్ చేశారని తమిళనాడు బీజేపీ నేతలు సణుగుతున్నారు. ఒక్క రాష్ర్టానికే పాతిక కోట్ల పరిహారం ఇస్తే...ఇదే ట్రెండ్ భవిష్యత్ లోనూ కొనసాగుతుందని, ఇతర రాష్ర్టాలు కూడా భారీగా డిమాండ్ చేస్తాయని వ్యాఖ్యానిస్తున్నారు.